గీత గోవిందం డైరెక్టర్ అడ్వాన్సులు తిరిగి ఇచ్చేస్తున్నాడోచ్

3
geetha govindam director parasuram

ఒక సినిమా హిట్ కొట్టిందో ఇక తిరుగుండదు.. హిట్ సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ కు పెద్ద నిర్మాతలు పిలిచి మరీ ఎడాపెడా ఎడ్వాన్సులు ఇచ్చేస్తారు. భవిష్యత్తులో తమ బ్యానర్ లో పనిచేసేలా ఒప్పందం కుదుర్చుకుంటారు. అయితే అన్నిసార్లు ఆ సినిమాలు తెరకెక్కవు. అలాంటి సమయంలో నిర్మాతలకు ఆ ఎడ్వాన్సును తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ‘గీతగోవిందం’ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు పరశురామ్ పరిస్థితి ప్రస్తుతం ఇదే విధంగా ఉందట. మోహన్ బాబు, బీవీఎస్ ఎన్ ప్రసాద్, మైత్రీ మూవీ మేకర్స్ కు పరశురామ్ అడ్వాన్సులు ఇచ్చేస్తున్నాడట.

‘గీతగోవిందం’ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఆ తర్వాత చాలామంది పరశురామ్ తో సినిమా చేసేందుకు రెడీ అయ్యారట. పరశురామ్ కు గతంలో ఎడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతలు తమ బ్యానర్లో సినిమా చేయాలనీ ఒత్తిడి చేశారట. అయితే స్టార్ హీరోతోనే సినిమా చేయాలని పట్టుబట్టి కూర్చున్న పరశురామ్ కు అలాంటి ప్రాజెక్టు ఏదీ సెట్ కాలేదు. ఇక ఈమధ్య 14 రీల్స్ ప్లస్ బ్యానర్లో నాగచైతన్యతో సినిమా ఫిక్స్ అయింది.
అనుకోకుండా చైతూతో ఛాన్స్ రావడం వలన పరశురామ్ ఇతర నిర్మాతల దగ్గర తీసుకున్న ఎడ్వాన్సులను వడ్డీతో సహా తిరిగి ఇస్తున్నాడట. అయితే ఇలా తిరిగి ఇవ్వడం గురించి రకరాకాల వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. నిజానికి ‘గీతగోవిందం’ తర్వాత పరశురామ్ కు దాదాపు ఎడాదిన్నర గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో రెండు సినిమాలు పూర్తి చేసే అవకాశం ఉన్నప్పటికీ సద్వినియోగం చేసుకోలేదని టాక్. స్పీడ్ డైరెక్టర్లను చూసి ఇలాంటి లాజిక్స్ తెలుసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.