పవన్ కళ్యాణ్ కీ షాక్ ఇచ్చిన మరో నేత !!

4

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. పార్టీకి చెందిన మరో ముఖ్య నేత జనసేనకు గుడ్‌బై చెప్పేశారు. ఇప్పటికే పార్టీలో కీలకంగా ఉన్న రావెల కిషోర్ బాబు, ఆకుల సత్యనారాయణ, చింతలపూడి వెంకట్రామయ్య, పార్ధసారధి వంటి కీలక నేతలు జనసేనకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు కూడా పార్టీ వీడారు. అయితే ఈ షాక్ నుంచి కోలుకోకముందే పవన్‌కు మరో పెద్ద షాక్ తగిలినట్టయ్యింది.

అయితే తాజాగా జనసేన మాజీ అధికార ప్రతినిధి, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అద్దేపల్లి శ్రీధర్ వైసీపీలో చేరిపోయారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరాలని ముందుగా అనుకున్నప్పటికి అది వీలు కాకపోవడంతో ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్ సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే మొదట అద్దేపల్లి శ్రీధర్ బీజేపీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తరువాత జనసేనలో చేరారు. అయితే ఈ ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్‌తో విబేధించిన ఆయన కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే సీఎం జగన్ పాలన విధానాలు నచ్చడంతో నేడు ఆయన వైసీపీలో చేరిపోయారు.