బాలయ్య వారసుడి కోసం జక్కన్న త్యాగం

7
rajamouli sacrifice for mokshagna

ఇండస్ట్రీలో వారసుల హవా కొనసాగుతూనే ఉంది. మెగా ఫ్యామిలీ అయితే త‌మ కుర్రాళ్ల‌తో ఇండ‌స్ట్రీని నింపేసింది.,కింగ్ నాగార్జున తన తనయులు ఇద్దరినీ ఇండస్ట్రీలోకి తెచ్చారు. గ‌త ప‌దేళ్ల‌లో ఒక్కో ఫ్యామిలీ నుంచి ముగ్గురు న‌లుగురు వార‌సులు కూడా వ‌చ్చారు. అయితే బాలయ్య కొడుకు మాత్రం ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు. కొడుకు మోక్షజ్ఞ ఇప్ప‌టికే 24 ఏట అడుగు పెట్టాడు . ప్రస్తుతం బాలయ్య రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేస్తున్నాడు. మహానాయకుడు దారుణంగా పరాజయం తర్వాత ఇప్పుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో రూలర్ సినిమాతో వచ్చాడు. ఇక తనయుడు ఎంట్రీ గురించి కూడా ఆలోచిస్తున్నాడని టాక్. ఎందుకంటే నంద‌మూరి కుటుంబం నుంచి కొత్త హీరో వ‌చ్చి ఏకంగా 13 ఏళ్లయింది. ఇండస్ట్రీలో నిలబడిన క‌ళ్యాణ్ రామ్, ఎన్టీఆర్, ల తరువాత బాలయ్య వారసుడి కోసం ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.

తండ్రికి త‌గ్గ త‌న‌యుడు.. తాత‌కు తగ్గ మ‌న‌వ‌డు అనిపించుకోవాల‌ని మోక్షజ్ఞ కూడా ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే అతడికి సినిమాలంటే ఆసక్తి లేదని, బిజినెస్ వైపు అడుగేస్తున్నాడంటూ ఈ మధ్య కొన్ని వార్తలు కూడా రావడంతో బాలయ్య ఫ్యాన్స్ ఖంగు తిన్నారు. ఈనేపధ్యంలో తన వారసుడు ఇప్పుడు సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నాడని, వీలైనంత త్వరగా సినిమాల్లో చూస్తారని రూలర్ ప్రమోషన్స్‌లో బాలయ్య వెల్లడించాడు.

అయితే ఎంట్రీ ఎలా ఉండాలన్న దానిపై కసరత్తు భారీగానే చేస్తున్నారట. తొలి సినిమా కోసం చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి. అయితే తన కొడుకును రాజమౌళి చేతుల మీదుగా లాంచ్ చేస్తే బావుంటుందని బాలయ్య భావిస్తున్నాడట. ఇందుకోసం 2019లోనే ఇది ప్లాన్ చేసినా కుదర్లేదు. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్న జక్కన్న మరో ఏడాది అందులోనే ఉంటాడు. అయితే లేటయినా రాజమౌళితోనే కొడుకును తీసుకురావాలని చూస్తున్నాడట.