యువకునిపై   గ్యాంగ్ రేప్…..

5
gang rape

ఈ మధ్య కాలంలో  మహిళలపై అకృత్యాలు పెరిగిపోయాయి. లైంగిక దాడులు,ఆపై హత్యలు చోటుచేసుకుంటున్నాయి. పసి పిల్లల మొదలు వృద్ధుల వరకూ మహిళ లాపియా అఘాయిత్యాలు సాగుతున్నాయి. అయితే  మహిళలకే కాదు,పురుషులకు కూడా భద్రత లేదా? అని ఈ సంఘటన చూస్తే అర్ధం అవుతుంది. మహిళలనే  కాదు, పురుషులను కూడా కొందరు కామాంధులు వదలడం లేదు.  ప్రస్తుతం సమాజం ఆలా తయారైంది. ఈ సమాజంలో ఆడవారికే కాదు మగవారికి కూడా రక్షణ లేదు చెప్పడానికే ఈ ఘటన తార్కాణం

.
దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో వికృత ఘటన జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళలపై జరుగుతున్న వరుస అఘాయిత్యాలపై ఓ వైపు ఆందోళన నెలకొంటే, ఇప్పుడు యువకుడిపై జరిగిన ఈ దారుణం ముంబయిలో  సంచలనం అయింది.  ముంబై సెంట్రల్ సబర్బన్ లో నివసించే ఓ యువకుడు, ఆదివారం ఓ రెస్టారెంట్ వద్ద సెల్ఫీ దిగి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. అతడి ఫాలోవర్స్ లో ఉన్న నలుగురు వ్యక్తులు దాన్ని చూసి  అడ్రస్ పట్టుకుని  అతడిని కలుసుకున్నారు. మొదట ఇన్ స్టాగ్రామ్ లో మిమ్మల్ని చాలారోజులుగా ఫాలో అవుతున్నామని, మీకు అభిమానులమని చెబుతూ  నమ్మించారు. అలాగే మీతో  కాసేపు గడపాలని ఉందని వారు కోరడంతో అతడు ఒకే అన్నాడు.

ఆ తరువాత అందరూ  రెస్టారెంట్ సమీపంలోనే అటు ఇటు తిరిగారు. తర్వాత ఆ యువకుడిని బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు.కదులుతున్న కారులోనే యువకుడిపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సోమవారం తెల్లవారుజామున అతడిని ఓ నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసి వెళ్లిపోయారు. కొద్దిసేపటికి  తేరుకున్న బాధితుడు నేరుగా ఇంటికెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో  వారు  వీబీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు మైనర్ కావడంతో అతడిని జువైనల్ హోమ్ తరలించారు.