అల వైకుంఠపురంలో మూవీ డేట్ మార్చేస్తున్నారా?

6
Ala Vaikunthapurramuloo

సినిమా రంగంలో ఒక్కోసారి కొన్నికొన్ని విచిత్రాలు,మరికొన్ని ప్రెస్టీజ్ కి పోయే అంశాలు ఉంటాయి. ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,సూపర్ స్టార్ మహేష్ బాబు మధ్య సంక్రాంతి మూవీ విషయంలో ప్రెస్టీజ్ వచ్చేసింది. వీళ్లిద్దరి సినిమాల మధ్య కలెక్షన్స్ గురించి తీవ్ర పోటీ నెలకొనడంతో రిలీజ్ పై మల్లగుల్లాలు పడుతున్నారు. హిట్ కాంబినేషన్ గా బ్లాక్ బస్టర్స్ అందుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబోలో తాజగా వస్తున్న అల వైకుంఠపురంలో మూవీ ఈ సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేయడానికి నిర్ణయించిన సంగతి తెల్సిందే.

గత మూవీ నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీ డిజాస్టర్ తర్వాత వస్తున్న ఈ మూవీపై ఇటు ఫాన్స్ లో అటు ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. జులాయి,సన్నాఫ్ సత్యమూర్తి మూవీస్ రెండూ కూడా బన్నీ, త్రివిక్రమ్ కంబోలోనే వచ్చి మంచి హిట్ అందుకున్నాయి. అందుకే బన్నీ కూడా ఈ మూవీ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. గీతా ఆర్ట్స్,హారిక,హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న రిలీజ్ చేయాలని అధికారికంగా నిర్ణయించారు. అదే సమయంలో సూపర్ స్టార్ మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు మూవీ కూడా రిలీజ్ కానుంది. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ మూవీపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

అయితే ఇద్దరి సినిమాలు ఒకేరోజు కాకుండా విడివిడిగా వచ్చేలా అగ్ర నిర్మాత దిల్ రాజు తదితరులు చర్చలు జరిపి జనవరి 11న సరిలేరు నీకెవ్వరు, 12న అల వైకుంఠపురంలో విడుదల అయ్యేలా ఒప్పందం కుదిర్చారట. అయితే షూటింగ్ పార్ట్ కంప్లిట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న అల వైకుంఠపురంలో మూవీ ని బన్నీ టీమ్ చూసి,ఈ సినిమా అనుకున్న దానికంటే బాగా రావడంతో జనవరి 10నే రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారట. అయితే ఇలా చేస్తే, మాట తప్పినట్లు అవుతుందని హారిక,హాసిని నిర్మాణ సంస్థలు చెప్పాయట. అవసరమైతే 11నే రిలీజ్ చేద్దామని అంటున్నారట. మొత్తానికి రిలీజ్ డేట్ పై సందిగ్దత కొనసాగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.