బాబు జైలుకు పోవాల్సిందేనంటున్న అంబటి

16
Ambati is expected to go to jail chandrababu

రాజధాని విషయంలో గత టీడీపీ ప్రభుత్వం పాల్పడిన అవినీతికి సంబంధించిన వివరాలను ఆధారాలతో సహా తాము ప్రజలకు తెలియజేస్తున్నామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రజెంటేషన్‌ను వైఎస్సార్‌ సీపీ ప్రసారం చేసింది. ఇందులో భాగంగా రాజధానిలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వివరాలను ప్రజల ముందుకు తీసుకువచ్చినట్లు అంబటి రాంబాబు తెలిపారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఆధారాలతో సహా విజువల్‌ను ప్రదర్శిస్తున్నామని పేర్కొన్నారు.అంతవరకూ బానే ఉంది. కానీ ఆతరవాత రెచ్చిపోయారు.

‘జైలుకు వెళ్ళడానికి చంద్రబాబు సిద్ధంగా ఉండాలి. రాజ్యాంగం మీద చంద్రబాబు ప్రమాణం చేసి చంద్రబాబు మాట తప్పారు. రాజధాని ఇక్కడ నుంచి తరలిపోలేదు. మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు పెట్టే ప్రయత్నం జరుగుతుంది. బినామీ రైతులకు, బ్రోకర్స్‌కు ప్రభుత్వం న్యాయం చేయలేదు. నిజమైన రైతులకు మాత్రమే ప్రభుత్వం న్యాయం చేస్తుంది. మూడు ప్రాంతాల ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లబ్ది చేకూరుస్తారు. గతంలో హైదరాబాద్‌లో అభివృద్ధి కేంద్రీకృతమైంది. అందువల్లే ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగినందున చంద్రబాబు సకుటుంబ సపరివార సమేతంగా వచ్చేసారు’ అని చంద్రబాబు తీరును అంబటి దుమ్ముదులిపేసారు.
‘ఉల్లిపాయల ధరలు దేశ వ్యాప్తంగా పెరిగితే చంద్రబాబు ఒక కేజీ అయిన రైతులకు హెరిటేజ్ నుంచి ఇచ్చారా. చంద్రబాబు అంత తొందర పడితే ఎలా? తప్పు చేస్తే శిక్ష తప్పదు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ఇంకా విచారణ జరుగుంది. ఎంతటి పెద్ద వారైనా శిక్ష తప్పదు. పవన్ కల్యాణ్ ఊరేగిoపుగా వెళ్తే ముళ్ల కంచె వేయరా. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌, లింగమనేనికి ఎలాంటి సంబంధం ఉందో అందరికి తెలుసు. చంద్రబాబు ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారు. పవన్ రోజుకొక మాట మాట్లాడుతున్నారు’ అని అంబటి విమర్శించారు.