అనుష్క తాజా ఫోటో తో షాకయిన ఫాన్స్!

5
anushka

   పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో  కింగ్ నాగార్జున నటించిన సూపర్ సినిమా ద్వారా టాలీవుడ్ లో  ఎంట్రీ ఇచ్చిన యోగా భామ అనుష్క శెట్టి  తెలుగులో దాదాపు అందరి హీరోలతో కల్సి నటించింది.  చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతూ, బాహుబలితో    వరల్డ్ వైడ్ గా కూడా బాహుబలితో గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ అమ్మడు  భారీగానే రెమ్యునరేషన్ అందుకుంటోంది.  అయితే భాగమతి మూవీ తర్వాత ఈమె బయట కనిపించడం లేదు.

   అయితే తాజాగా  హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్న నిశ్శబ్దం మూవీలో అనుష్క నటిస్తోంది. కోన వెంకట్ తో కల్సి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ భాగస్వామ్యం వహిస్తోంది. తెలుగు,హిందీ ,ఇంగ్లిష్ లలో ఈ మూవీ రూపొందుతోంది. ఇండస్ట్రీలో  వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన అనుష్కకు  అరుంధతి మూవీ అనూహ్యమైన పేరు తెచ్చిపెట్టింది.  కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఈమె  నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. వసూళ్లు సాధించడంతో పాటు ఈ మూవీ 7నంది పురస్కారాలు సొంతం చేసుకుంది.

     కె రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ రెండు భాషల్లో   తెరకెక్కించిన సైజ్ జీరో మూవీ కోసం భారీగా బరువు  పెరిగింది. ఓ విధంగా ఆమె దీనివలన  కెరీర్ లో కొన్ని ఇబ్బందులు పడింది. బాహుబలి తొలిభాగం తర్వాత సైజ్ జీరోలో నటించడం వలన బాహుబలి 2సమయంలో అనుష్క బరువు ఇబ్బందిగా మారింది. దాంతో  గ్రాఫిక్స్ తో సన్నగా చూపించేలా దర్శక ధీరుడు శ్రమించాడని టాక్ వచ్చింది. అయితే ఛార్మితో దిగిన ఫోటోను ట్వీట్ చేయడంతో  హాట్ టాపిక్ అయింది. ఇన్నాళ్లూ బరువు తగ్గకపోవడం వల్లనే బయటకు రాలేదని ఈ ఫొటోలో అనుష్కను చూసాక అందరూ భావిస్తున్నారు.