ఎపి కొత్త సీఎస్ ఎవరంటే.. అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..!!

29
Ap New CS Neelam Sawhney

ఆంధ్రప్రదేశ్‌ లో ఇటీవల చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యంను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి మనకు తెలిసిందే. కానీ ఆతరువాత ఆస్థానాన్ని భర్తీ చేసేది ఎవరనే ప్రశ్న అందరిలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఎట్టకేలకు ఆ పదవిని స్వీకరించేది ఎవరో తెలిసిపోయింది. ఎల్వీ సుబ్రమణ్యం తర్వాత నీలం సహానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీ కాబోతున్నారు.

కాగా ప్రస్తుతానికి కేంద్ర సర్వీసుల్లో సేవలు అందిస్తున్న నీలం సహానీ, తాజాగా కేంద్ర సర్వీసుల నుండి రిలీవ్ అయ్యారు. సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి ఏపికి రిలీవ్ చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం రిలీవ్ చేయడంతో ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా నియమించారు. ఈమేరకు నియామక ఉత్తర్వులు త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు. నీలం సహానీ 1984 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి. ఆమెకు 2020 జూన్ 30 వరకు పదవీ కాలం ఉంది.