బాలయ్య,వెంకీ కాంపౌండ్ లనుంచి హీరోలు వస్తారా లేదా!

7
Balakrishna and venkatesh

మెగాస్టార్ చిరంజీవి వారసుడు రామ్ చరణ్, కింగ్ నాగార్జున వారసులు నాగ చైత్యన్య,అఖిల్  సినీహీరోలుగా టాలీవుడ్ లో కెరీర్ సాగిస్తుంటే, నటసింహా నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ వారసుల సంగతి ఏంటనే దానిపై చర్చ నడుస్తోంది.  గత కొంతకాలంగా బాలయ్య  వారసుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ గురించిన ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇటీవలే మోక్షజ్ఞ లేటెస్ట్ ఫోటోలు నెట్ లో  లీకవ్వడంతో అతడు సినీ ఎంట్రీ ఇవ్వడం లేదని, అందుకే హీరోయిక్ లుక్ కనిపించడం లేదని ఫాన్స్   సీరియస్ గా చర్చించుకుంటున్నారు.

మోక్షజ్ఞ నటనావైపు మొగ్గు చూపడం లేదన్న విషయం  పరిశ్రమ వర్గాలు సహా అభిమానుల్లో విస్త్రతంగా చర్చ సాగుతోంది. ఇక  ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విక్టరీ వెంకటేష్ వారసుడు అర్జున్  కూడా  హీరో అవ్వాలా వద్దా? అని  ఇప్పటికి  డైలమా లోనే ఉంది.  అయితే కెరీర్ గురించి సీరియస్ గా ఆలోచించే క్రమంలో తండ్రిలా హీరో అవ్వాలా లేక  వేరేగా  కెరీర్ సాగించాలా? అన్నది తేల్చుకుంటాడట.

అందుకే  అర్జున్ ఏం కావాలనుకున్నా అందుకు తనవంతు సహకారం ఉంటుందని వెంకీ అంటున్నాడు.  బాలకృష్ణ- వెంకటేష్ పరిశ్రమలో అగ్ర హీరోలు. దశాబ్ధాల పాటు గొప్ప ఫాలోయింగ్ ని సంపాదించిన హీరోలు కావడంతో సహజంగానే ఆ ఇద్దరి వారసుల రంగ ప్రవేశంపై అభిమానుల్లో భారీగానే అంచానాలు ఉంటాయి.  దగ్గుబాటి.. నందమూరి కాంపౌండ్ ల నుంచి వారసుల రంగ ప్రవేశంపై క్లారిటీ వచ్చేదాకా రకరకాల రూమర్స్ తప్పవు.