బాలయ్య ఇంటిని కూల్చేస్తారా?- ఎందుకో తెలుసా  

7
Balakrishna_ home

సెలబ్రిటీల ఇళ్లల్లో ఏది జరిగినా వింతగానే ఉంటుంది. పైగా సినీ, రాజకీయ రంగాల్లో వుండే సెలబ్రిటీలు ఏం చేసినా దానివెనుక కారణం ఏంటబ్బా అని వెతకడం సహజం. విపక్ష నేతలను బెదిరించే పనులు కూడా సర్కార్ చేస్తుంటుంది. అలాంటి సమయంలో అక్రమ కట్టడాల పేరుతొ ఇంటిని కూల్చేస్తున్న సంఘటనలు ఉంటాయి. అయితే  తెలుగుదేశం ఎమ్మెల్యే ,  సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గురించి ఓ వార్త ఇప్పుడు  సో్షల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వైపు ఆయన తన రాబోయే సినిమా బిజీలో ఉండగా, మరోవైపు ఆయన హైదరాబాద్ లోని నివాసం గురించి ఆసక్తికర చర్చ మొదలైంది. హైదరాబాద్ నడిబొడ్డున జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ కు అతి సమీపంలో గల   బాలకృష్ణ నివాసం నగరంలో పర్యటించే వారి చూపును ఆకర్షిస్తుంది. మరి  ఆ ఇల్లును కూల్చేయబోతున్నారట. అక్కడో పేద్ద షాపింగ్ కాంప్లెక్స్ కడతారట.

ఇటు ఫిల్మ్ నగర్ , అటు జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ వెళ్లే దారిలో నడిబొడ్డున అంటే   ప్రైమ్ లొకేషన్ లో ఉండటం వల్ల సహజంగానే కాలుష్యం – శబ్దాలు అధికమే. దీనికి తోడుగా ఈ దారిలో ఓ ఫ్లై ఓవర్ నిర్మాణం చేస్తారట. వివిధ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం రోడ్డు విస్తరణ కోసం చేపట్టే ఈ ఫ్లై ఓవర్ వల్ల బాలయ్య ఇంటిలో కొంత భాగం సదరు విస్తరణ లో పోతుందట.  ఈ ప్రచారం నేపథ్యంలో విస్తరణ పేరుతో తన ఇంటి స్థలం సమర్పించుకునే బదులుగా తానే ఆ ఇంటిని కూల్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిదని ఆలోచనలో పడ్డాడట.

ఇప్పటికే బాలయ్య ఆ ఇంటికి పలు వాస్తు మార్పులు  చేసినా,  కలిసిరాలేదని టాక్ నడుస్తోంది. ఇక  రోడ్ విస్తరణ తెరమీదకు వచ్చిన  నేపథ్యంలో బాలయ్య తన ఇంటిని కూల్చేసేందుకు సిద్ధమయ్యారట. నగరం మధ్యలో ఉన్నందున షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఇచ్చే అవకాశం ఉందట. అయితే ప్రస్తుత ఇంటిని కూల్చేసే బాలయ్య అదే జూబ్లీహిల్స్ లో మరో ఇళ్లు కట్టుకుంటారా లేక, గత కొద్దికాలంగా ప్రముఖ నటులంతా వెళుతున్నట్లు మణికొండ వైపు వెళ్లి అక్కడ విశాలమైన గృహం నిర్మించుకుంటారా అనే దానిపై కూడా జోరుగా చర్చ నడుస్తోంది…….