బాలయ్య బిగ్గెస్ట్  హిట్ మూవీస్ ఏమిటో తెలుసా?

5
Balayya

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ  ఎన్టీఆర్ తో కల్సి  పలు సినిమాల్లో నటించిన  బాలయ్య ఆతర్వాత ఎన్టీఆర్ వారసునిగా  1984లో కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన మంగమ్మగారి మనవడు బాలయ్య కెరీర్ ని అనూహ్యంగా  మలుపు తిప్పింది. 1989లో వచ్చిన ముద్దుల మావయ్య మూవీ బాలయ్య సినిమాల్లో మైలురాయిగా నిల్చింది. కమర్షియల్ సక్సెస్ అందుకుంది.  ఏ కోదండ రామిరెడ్డి డైరెక్షన్ లో 1990లో  వచ్చిన నారీ నారీ నడుమ మురారి కామెడీ రొమాంటిక్  మూవీ ఆడియన్స్ ని అలరించడంతో పాటు కమర్షియల్ గా హిట్ అందుకుంది.

బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన లారీ డ్రైవర్ మూవీతో బాలయ్య రేంజ్ అమాంతం పెరిగింది. సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో వచ్చిన రొమాంటిక్ సైన్టిఫిక్ మూవీ  ఆదిత్య 369 అప్పట్లో ట్రెండ్ క్రియేట్ చేసింది. 1994లో సింగీతం డైరెక్షన్ లోనే వచ్చిన భైరవ ద్వీపం మూవీ బాలయ్య నట జీవితంలో అద్భుత ప్రేమ కావ్యంగా అపూర్వ విజయాన్ని సాధించింది.

అయితే బి గోపాల్ డైరెక్షన్ లో1999లో  వచ్చిన సమరసింహారెడ్డి మూవీ బాలయ్యను మాస్ హీరగా నిలబెట్టింది. అద్భుతమైన ఫ్యాక్షన్ కథతో వచ్చిన  ఈ మూవీ అన్ని రికార్డ్స్  తిరగరాసి, బాలయ్య సినీ చరిత్ర మార్చేసింది. 2001లో  బి గోపాల్ డైరెక్షన్ లోనే  బాలయ్య చేసిన  యాక్షన్ మూవీ నరసింహనాయుడు బిగ్గెస్ట్ హిట్ అయింది. బోయపాటి ,బాలయ్య కాంబోలో వచ్చిన సింహా మూవీ బాలయ్యలో యాక్షన్ హీరోని తట్టిలేపింది.  ఆతర్వాత  వచ్చిన లెజెండ్ మూవీ నిజంగా బాలయ్యను లెజెండ్ గా నిలబెట్టింది.