టైటిల్ గెలిచినా రాహుల్. మనసులని గెలుచుకున్న శ్రీముఖి..!!

32
Bigg Boss Season 3 Winner

బిగ్‌బాస్ సీజన్ 3 ఎన్నో అంచనాలు, వివాదాల మధ్య ప్రారంభమైన ఈ సీజన్ ఎట్టకేలకు ఫైనల్స్‌ని పూర్తి చేసుకుంది. ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ సీజన్ విన్నర్ ఎవరో తేలిపోయింది. ధూమ్ ధాం డ్యాన్స్ లు, నాగార్జున హోస్టింగ్ చమక్కులు, సెలబ్రిటీల సందడితో గ్రాండ్ ఫినాలే హొరెత్తిపోయింది. అయితే షోలో శ్రీముఖి, రాహుల్, వరుణ్, అలీరెజా, బాబా భాస్కర్ ఫైనల్స్ లో ఉండగా ఈ ఐదుగురు నుంచి ముగ్గురు ఎలిమినేట్ అయిపోయారు. శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ మాత్రమే మిగిలారు. అయితే వీరిద్దరిలో బిగ్‌బాస్ టైటిల్ ఎవరికి ఇవ్వబోతున్నారో అని ప్రేక్షకులలో మరింత టెన్షన్ కనిపించింది.

అయితే రాహుల్, శ్రీముఖిని హౌస్ నుంచి బయటకు తీసుకురావడానికి నాగార్జున హౌస్ లోపలికి వెళ్లారు. హౌస్‌లో వారి ఇద్దరి జర్నీనీ వీడియోల ద్వారా చూశారు. అయితే అనుకుకోకుండా నాగార్జున వారికి ఒక బంఫర్ ఆఫర్ ఇచ్చారు. బిగ్ బాస్ ప్రైజ్ మనీ 50 లక్షలలో చెరో 25 లక్షలు తీసుకొని వెళ్ళిపోవాలని సూచించారు. అప్పుడు మీ ఇద్దరు బిగ్‌బాస్ విజేతలుగా ఉంటారని అన్నారు. అయితే ఇది విన్న ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇద్దరు విజేతలు ఎలా అవుతారు అనుకున్నారు. అయితే అలా చేయడానికి రాహుల్, శ్రీముఖి అంగీకరించలేదు. నాగ్ ఎంత చెప్పినా వినలేదు.

అయితే చేసేదేమి లేక వారిని స్టేజ్‌పైకి తీసుకొచ్చారు నాగార్జున. ఇక వారిద్దరిలో విజేత ఎవరో తేల్చడానికి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. చిరంజీవికి గ్రాండ్ వెల్‌కం చెప్పారు నాగార్జున. చిరంజీవి మాట్లాడుతూ ఒక్కో కంటెస్టెంట్‌ని పలకరించి, సరదా మాటలతో నవ్వులు పూయించారు. బిగ్‌బాస్‌లో నాగ్ జర్నీనీ చూపించమని కోరిన చిరు ఆ తరువాత ఫైనల్స్ లో విజేత ఎవరో మీరు చెప్పండి అంటూ నాగార్జునను కోరారు. అందరి ఉత్కంఠకు తెరతీస్తూ నాగార్జున రాహుల్ సిప్లిగంజ్‌ని విజేతగా ప్రకటించారు. చిరంజీవి ఆయనకు ట్రోఫీ అందచేశారు. అయితే రాహుల్ టైటిల్ విన్ అయితే, మొదటి నుంచి హౌస్‌లో ఉండి చివరి వరకు పోటీలో నిలబడిన శ్రీముఖి మాత్రం ఎందరో ప్రేక్షకుల మనసులు దోచుకుంది.