సందడిగా మైరోన్ హామ్స్ వార్షికోత్సవ వేడుకలు

63
BUSTLING MYRON HAMS ANNIVERSARY CELEBRATIONS

పాటలతో అలరించిన గాయకుడు సింహ, ఆర్. పి పట్నాయక్

మైరోన్ హామ్స్ సంస్థ తమ మూడవ వార్షికోత్సవ ను సందడిగా జరుపుకుంది. జూబ్లీహిల్స్లోని  హోటల్ దసపల్లా లో జరిగిన ఈ వేడుకలో సినీ దర్శకులు మారుతి, సినీ నిర్మాతలు కె.ఎస్.రామారావు, రాధా మోహన్, నటుడు రాకేష్ , సంగీత దర్శకులు ఆర్. పి పట్నాయక్ లు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మైరోన్ హామ్స్ నూతన ప్రాజెక్టు స్థిత ప్రస్తా, నక్షత్ర లోగోను  దర్శకులు మారుతి, రాధామోహన్, నటుడు రాకేశ్ ఆవిష్కరించారు.  సంస్థ సీఎండీ డాక్టర్  ఎం. యువ రాజు  మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తమ వెంచర్లను రూపొందించామన్నారు.

ఈ సందర్భంగా సినీ గాయకుడు సింహ పాడిన పాటలు అందర్నీ ఉర్రూతలూగించాయి. ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడిపారు.  ఆర్. పి. పట్నాయక్ కూడా  రాను రాను అంటూనే చిన్నది … గాజువాక పిల్ల పాట పాడి అందరిని అలరించారు .