‘దబాంగ్‌ 3’ క్లైమాక్స్‌ ఫుల్ యాక్షన్ తో నింపేసారట…..

5
dhabang climax

ఏ సినిమాకైనా క్లైమాక్స్ కీలకం. అక్కడ దెబ్బతింటే మొత్తం సినిమాయే పోతుంది. అయితే  బాలీవుడ్   కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ నటించిన భారీ యాక్షన్‌ మూవీ ‘దబాంగ్‌ 3’ క్లైమాక్స్‌ గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్‌ వెలుగు చూసింది.  ఈ మూవీ   చిత్రీకరణ దాదాపు పూర్తికావచ్చింది. ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌ ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటిస్తోంది.

సల్మాన్‌కి విలన్‌గా కిచా సుదీప్‌ నటిస్తున్నారు. విలన్‌గా సుదీప్‌ పర్‌ఫామెన్స్‌ ఎలా ఉంటుందో తెలుగులో ‘ఈగ’ సినిమాలో చూస్తే తెలిసిపోతుంది. ‘ఈగ’కు విలన్‌గానే అంత పవర్‌ చూపిస్తే, ఇక్కడ కండల వీరుడి ముందు సుదీప్‌ ఇంకెంత పవర్‌ చూపిస్తాడో ఊహించవచ్చు. ఇక  ప్రభుదేవా డైరెక్షన్‌ అంటే ఫైట్సే కాదు, డాన్సులు కూడా సూపర్బ్‌.   క్లైమాక్స్‌ ఫుల్‌ యాక్షన్‌తో నింపేశారట.

ఈద్‌ సందర్భంగా ప్రతీ యేటా  సల్మాన్‌ ఖాన్‌ నుండి ఓ సినిమా  వస్తోంది. అయితే,  ఈ ఏడాది క్రిస్మస్‌ సండర్భంగా డిశంబర్‌ 25న ‘దబాంగ్‌ 3’తో ఫ్యాన్స్‌ని ఫిదా అవుతారట.   ఈ సన్నివేశం కోసం ఏకంగా 500 మంది జూనియర్‌ ఆర్టిస్టులు, దాదాపు 100 కార్లు ఉపయోగించారట. 500 మంది శత్రువులతో సల్మాన్‌ పోరాడే సన్నివేశాలు అత్యద్భుతంగా తెరకెక్కించారట. అలాగే 100 కార్లను హీరో దగ్ధం చేసే సీన్‌ కళ్లు జిగేల్‌ మనిపిస్తుందట. ఇది తెలిసి ఫాన్స్ ఖుషి అవుతున్నారు.