డ్రగ్ మాఫియా న్యూ ఇయర్ టార్గెట్ చేసుకున్నారా?

5
drug mafia

 ఎంతగా చర్యలు చేపట్టినా డ్రగ్స్ మాఫియా ఎక్కడో అక్కడ చాపకింద నీరులా ఇది విస్తరిస్తూనే ఉంది.  మెల్లి మెల్లిగా మత్తులో ముంచి  ఆ తరువాత దానికి బానిసగా మార్చుకొని, చివరికి    ప్రాణాల మీదకు తీసుకొచ్చే  ప్రమాదకర మాదకద్రవ్యం గా డ్రగ్స్ ని చెబుతారు. దీనిపై  యూత్ కి ఎంతలా అవగాహన పెంచినా తగ్గడం లేదు సరికదా,   యువకులే టార్గెట్ గా ఈ డ్రగ్స్ దందా నడుస్తోంది. ఇక   ఈ న్యూఇయర్ సెలబ్రేషన్సే టార్గెట్ గా డ్రగ్స్ మాఫియా హైదరాబాద్ ని ఎంచుకుందట.

   ఉల్లిపాయ –  ఎండుమిర్చీల్లో కూడా  డ్రగ్ మాఫియా   కొన్ని రోజుల క్రితం డ్రగ్స్  తరలించారు. రకరకాల పరికరాల్లో వీటిని అమర్చి దందా చేసేవారు.   ఇప్పుడు ఏకంగా  మానవ దేహాలనే  డ్రగ్ కంటైనర్లుగా వాడుకుంటోంది. ఎల్ ఎస్ డీ తదితర మత్తు మందులను పౌడర్, ట్యాబ్లెట్ల రూపంలో నింపి, వాటిని డ్రగ్ రవాణాకు అంగీకరించిన ఓ మనిషి శరీరంలో స్కానర్లకు అందని రీతిలో రహస్య అవయవాల్లో దాచి,  సరఫరా చేస్తున్నారు. ఇలా  డ్రగ్ సరఫరా చేసేవారిని పోలీసులు  చాలా సార్లు పట్టుకున్నారు.

   అయితే  మరో 15 రోజుల్లో 2020 న్యూయర్ వేడుక రానుంది. దీంతో ఈ వేడుకలను టార్గెట్ చేస్తూ.. పెద్ద మొత్తంలో డ్రగ్స్ చేతులు మారనుందని టాక్. ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చిన సమాచారం మేరకు ఇప్పటికే పోలీసులు తనిఖీలు కూడా స్టార్ట్  చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు,  రైల్వే స్టేషన్లలో , బస్ స్టేషన్ లలో రెక్కీ నిర్వహిస్తున్నారు. అనుమానాస్పందంగా వ్యవహరించిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  ఇక   ‘దిశ’ ఘటన నేపథ్యంలో న్యూయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు పెట్టబోతున్నారట