More

  వెన్నుపోటు పొడిచారు .. జీవితంపై దెబ్బ కొట్టారు

  Ex SVBC Chairman Prudhvi Raj Sensational Comments:

  ఆమధ్య వివాదాస్పదం అయిన నేపథ్యంలో ఎస్వీబీసీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేసి,దూరంగా ఉంటున్న నటుడు పృథ్వీరాజ్‌ తాజాగా మళ్ళీ మీడియా ముందుకు వచ్చాడు. సోమవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ తన చుట్టూ తిరిగినవారే తనను వెన్నుపోటు పొడిచారని ఆవేదన వ్యక్తం చేసాడు. ‘ఇటీవల కాలంలో మానసికంగా చాలా ఇబ్బంది పడ్డా. చాలా ఆవేదనతో తిరుమలకు వచ్చా. ఒక మనిషిని తాత్కాలికంగా బాధపెట్టి బయటకు పంపినా, నిజం ఏదో ఒకరోజు బయటపడుతుంది. 11 ఏళ్లు పార్టీ కోసం కష్టపడిన నేపథ్యంలోనే సీఎం తనకు ఎస్వీబీసీ చైర్మన్‌ పదవి ఇచ్చారు. ఆ రోజే ఆ పదవి వద్దని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో’అని పృథ్విరాజ్ వాపోయాడు.

  ‘బాగా పనిచేయండి, కావాలంటే సీఎం కాళ్లు పట్టుకుని ఉద్యోగాలు పర్మినెంట్‌ చేయిస్తానని ఉద్యోగులతో చెప్పినందుకు నాకు ఐదు నెలల పదవీకాలంలో యాభైఏళ్ల జీవితాన్ని చూపారు. నేను చనిపోతే కూడా ఇవ్వనంత పబ్లిసిటీ మీడియాలో ఇచ్చేశారు. ఎవరూ ఒత్తిడి చేయకపోయినా నిజాయితీ కలిగిన వ్యక్తిగా పదవికి రాజీనామా చేశా. నేను వెళ్లిపోయిన తర్వాత చాలామంది ఆనందంతో పార్టీలు చేసుకున్నారు. కర్రలు, రాళ్లతో కొట్టినా పర్వాలేదు, కానీ జీవితంపై కొట్టడం దారుణం.నా పక్కనే ఉంటూ కొంతమంది నాపై కుట్ర చేసి వెన్నుపోటు పొడిచారు. సినిమాల్లో చూపించేవిధంగా రేప్‌ చేసి వదిలారు. ఇక్కడున్న నాయకులెవరో కూడా నాకు తెలీదు.నాపై వారికి ఎందుకో అంత కక్ష’అని పృథ్వి రాజ్ ఆవేదన చెందాడు.

  ఇది కూడా చదవండి:బీజేపీతో పొత్తుపై వైసిపి క్లారిటీ ఇచ్చేసింది

  “గత కొన్ని నెలలుగా మాంసం, మద్యం తీసుకోలేదు. ఇందుకు రుజువుగా తీయించిన రక్త నమూనాల నివేదికను త్వరలో సీఎంకు అందజేస్తా. సీఎం జగన్‌ నా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా. చనిపోయిన తర్వాత కూడా నాపై వైసీపీ జెండానే ఉంటుంది. ఆరోపణలపై విచారణను స్వాగతిస్తున్నా. ఇక రైతులపై చేసిన వ్యాఖ్యలను కూడా వక్రీకరించారు. లౌక్యం సినిమాలో నటించాను కానీ, నాకు లౌక్యం తెలియదు. అది తెలిస్తే మరో పదేళ్లు ఎస్వీబీసీ చైర్మన్‌గా ఉండేవాడిని’ అని పృథ్విరాజ్ వ్యాఖ్యానించాడు.

  RELATED ARTICLES

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  మార్చిలో బిల్లే ఈ నెలా చెల్లించాలి

    లాక్‌డౌన్‌ నేపథ్యంలో సిబ్బంది ప్రతీ ఇంటికి వచ్చి మీటర్‌ రీడింగ్‌ తీసే అవకాశం లేదని, అందుకే మార్చిలో వచ్చిన బిల్లే ఈ నెలా చెల్లించాల్సి ఉంటుందని, కరెంట్‌ బిల్లులనూ మూడు నెలల పాటు...

  సోనియాపై ఓ రేంజ్ లో మండిపడ్డ అమిత్ షా

  Amit shah strong comments on Sonia gandhi ఈమధ్య కనిపించకుండా ఉంటున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా   చాలా కాలం తర్వాత ఎంట్రీ ఇస్తూనే  సోనియా గాంధీపైనా కాంగ్రెస్ పార్టీ...

  Latest Posts

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  Recent Posts

  పార్టీ కోసం త్యాగాలు మరవలేనివి – టి.డి.పి అధినేత

  Telugu Desam Party 39th formation day: ఈ విపత్తు సమయాలలో  ప్రజల్లో మనమే ధైర్యం నింపాలి. కరోనా మహమ్మారికి రాజు, పేద అనే బేదం లేదు.  అందరం జాగ్రత్తగా ఉండాలి అని టిడిపి...

  డేంజర్ జోన్స్  గా విదేశాల నుంచి వచ్చిన వారి ప్రాంతాలు……..

  Govt Announced coronavirus danger zones in india: ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తూ, ఎవరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇక మన   దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో...

  తీగ లాగితే డొంక కదిలిందా … కరోనా కేసుల కలకలం

  A disturbance of corona cases in nizamuddin religious meet: విదేశాలనుంచి వచ్చిన వారి నుంచే ఎక్కువగా కరోనా వైరస్ వచ్చిందన్నది నిజం. అయితే  విదేశాల నుంచి వచ్చిన వారితో కలిసి దేశ...

  కలకలం రేపిన మౌలానా సాద్ ఆడియో 

  Nizamuddin Markaz chief Maulana Saad audio released ఒక్కసారిగా  పాజిటివ్‌ కేసులు పెరగడం, ఇందులో  అత్యధికులు ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్‌కు వెళ్లొచ్చినవాళ్లే అని తేలడంతో దేశమంతా ఒక్కసారి ఉలిక్కిపడింది. అన్ని రాష్ట్రాల్లో...