సంస్కృతం తో కొవ్వు,షుగర్ లకు  విముక్తి …….

4
Ganeshsing

పార్లమెంట్ సమావేశాల్లో సంస్కృత విశ్వవిద్యాలయాల బిల్లుపై చర్చ సందర్భంగా   బీజేపీ ఎంపీ గణేష్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగించాయి.  రోజూ సంస్కృతంలో మాట్లాడితే షుగర్ కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోవచ్చని అన్నారు. దీనికి వివరణ కూడా ఇచ్చారు.

“సంస్కృతం మాట్లాడడం ద్వారా నాడీ వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది.  ఇస్లామిక్ భాషలతో సహా ప్రపంచంలోని 97 భాషలకు సంస్కృతమే ఆధారం.  అంతేకాదు.. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ సంస్కృతంలో జరిపితే సిస్టమ్ ఆగకుండా పనిచేస్తుంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పరిశోధనల్లో ఈ విషయం కూడా తేలింది”అని ఎంపీ గణేష్ సింగ్ చెప్పుకొచ్చారు.

ఇప్పటికే పలువురు నేతలు ఆయా అంశాలపై  నోరుజారడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్స్ పెడ్తున్నారు. మొన్నటికి మొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ఉల్లిపాయ తాను వాడనని చెబుతూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.   ఆమెపై సోషల్ మీడియాలో మీమ్స్ ట్రోల్స్ పడ్డాయి. తాజాగా బీజేపీ ఎంపీ మాటలపై కూడా ట్రోల్స్ పడుతున్నాయ్.