గొల్లపూడి మారుతీరావు అస్తమయం…….

13
gollapudi maruthi rao

తెలుగు చలన చిత్ర సీమతో విలక్షణ  నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, రచయిత గొల్లపూడి మారుతీరావు గురువారం  కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నై లైఫ్‌లైన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈయన వయస్సు 80సంవత్సరాలు. కేరక్టర్ ఆరిస్టుగా, విలన్ గా, తండ్రిగా,మావగారు గా ఇలా ఎన్నో పాత్రలతో మెప్పించిన గొల్లపూడి  మరణంతో తెలుగు ఇండస్ట్రీలో విషాదం అలుముకుంది.  మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, బంధువులు కన్నీటి పర్యంతం అయ్యారు . ఆయన మృతిపట్ల టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటీనటులు తీవ్ర సంతాపం తెలిపారు.

మారుతీరావు కొన్నాళ్లు విశాఖలో మరికొంతకాలం చెన్నైలో గొల్లపూడి ఉంటున్నారు. నటనా, రచనా రంగాల్లో తనదైన ముద్ర వేశారు. సాహితీ రంగంలోనూ ఆయన విశిష్ట కృషి చేశారు. రేడియో వ్యాఖ్యతగా కెరీర్‌ మొదలుపెట్టిన ఆయన.. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. స్వాతిముత్యం లాంటి సినిమాలో వినూత్న విలనిజం చూపించారు.

ఇక తన  తనయుడు శ్రీనివాస్‌ పేరుతో కొత్త దర్శకులకు విశిష్ట ప్రోత్సాహాకాలు, అవార్డులను గొల్లపూడి అందించారు. నాటకాలు, నాటికలు, కథానికలు, సినిమా కథలు పత్రికా వ్యాసాల్లో గొల్లపూడి మారుతీరావు తనదైన  ముద్ర  వేశారు. ‘కౌముది’ పేరుతో ఆయన వ్యాస సంకలనాలు వచ్చేవి. వర్తమాన రాజకీయాలు, క్రికెట్ లాంటి అంశాలపై  గొల్లపూడి మారుతీరావు కామెంట్స్ సునిశిత విమర్శలను తలపిస్తాయి