జగన్ విషయంలో ఉండవల్లి యూ టర్న్ – ఎవరి పాత్ర ఉంది..!!

4
undavalli arun kumar

గత కొంత కాలం నుంచి ఏపీ రాజకీయ వర్గాల్లో కీలకమైన సీనియర్ నేతల్లో ఒకరైనటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ కాస్త సైలెంట్ గా ఉన్న సంగతి అందరికి తెలిసిందే.గతంలో మాత్రం అప్పుడు తెలుగుదేశం పార్టీను విమర్శించడానికి ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టారు కానీ ఇప్పుడు జగన్ పాలనపై మాట్లాడ్డం లేదు ఎందుకు అని కొంతమంది అడిగే లోపే మరో ప్రెస్ మీట్ పెట్టి ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యారు. అయితే ఉండవల్లి వై ఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితులు అని అందరికి తెలుసు అలాగే ఉండవల్లి ఏ విషయం అయినా సరే సూటిగా సుత్తి లేకుండా చెప్పేస్తారన్న సంగతి కూడా అందరికి తెలిసిందే.

కానీ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో మళ్ళీ బయటకొచ్చి మాట్లాడ్డం వెనుక ఏదో వ్యూహం ఉందని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉండవల్లి అందరి విషయంలో కూడా తటస్థంగా మాట్లాడుతున్నట్టు అనిపించినా కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం జగన్ కు కాస్త పాజిటివ్ గానే వ్యవహరిస్తున్నారన్న భావన ఆయన మాటల్లోనే కనిపిస్తుంది. అందువల్లే ఆయన జగన్ ను ఏమన్నా అన్నా సరే వైసీపీ శ్రేణులు కూడా పెద్దగా స్పందించరు.ఇలాగే ఉండవల్లి ఇప్పుడు జగన్ ను సేవ్ చేసే పనిలో ఉన్నారని చెప్పాలి.ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితమే జగన్ పై తీవ్ర స్థాయి విమర్శలు చేసారు.అయితే…ఇక్కడే బాగా ఆలోచించినట్టయితే ఉండవల్లి తాను జగన్ కు హెచ్చరిక చేస్తున్నానని కూడా చెప్పారు.

జగన్ పాలన ఇలాగే కొనసాగితే తొమ్మిది నెలల్లోనే కూలిపోయినా పెద్ద ఆశ్చర్య పడక్కర్లేదని కూడా వార్నింగ్ ఇచ్చారు. కానీ నిజానికి ఇది మాత్రం జగన్ ను హెచ్చరించినట్టు కాదని చెప్పాలి.హెచ్చరిస్తున్నా అని చెబుతూ జగన్ తన పార్టీలో జరుగుతున్న అవకతవకలను గమనించి వాటిని సరి చేసి పార్టీపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను మళ్ళీ నువ్వే పోగొట్టాలి అని పరోక్షంగా చెప్తున్నట్టు ఉంది.ఇలా ఒక పక్క తిడుతూనే జగన్ కు జాగ్రత్త చెప్తున్నారు.మరి దీనిని జగన్ పసిగట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటారో లేదో చూడాలి.కానీ నిజానికి ఇది మాత్రం జగన్ ను హెచ్చరించినట్టు కాదని చెప్పాలి.హెచ్చరిస్తున్నా అని చెబుతూ జగన్ తన పార్టీలో జరుగుతున్న అవకతవకలను గమనించి వాటిని సరి చేసి పార్టీపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను మళ్ళీ నువ్వే పోగొట్టాలి అని పరోక్షంగా చెప్తున్నట్టు ఉంది.ఇలా ఒక పక్క తిడుతూనే జగన్ కు జాగ్రత్త చెప్తున్నారు.మరి దీనిని జగన్ పసిగట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటారో లేదో చూడాలి.