నేడు విశాఖలో రెండో వన్డే: సిరీస్‌ సమంకోసం భారత్‌

5
India vs Westindies

విశాఖపట్నం: వెస్టిండీస్‌పై టీ20 సిరీస్‌ గెలుచుకున్న పటిష్ట టీమిండియాకు చెన్నై వన్డేలో అనూహ్య పరాజయం ఎదురైంది. గత మ్యాచ్‌లో బౌలింగ్, టాపార్డర్‌ వైఫల్యంతో ఓటమిని ఎదుర్కొన్న కోహ్లీసేన విజయమే లక్ష్యంగా రెండో వన్డేకు సిద్ధమైంది. విశాఖలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా ఈ రోజు జరిగే పోరులో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సిరీస్‌లో నిలిచే స్థితిలో టీమిండియా ఉంది. దీంతో సిరీస్‌ సమంకోసం భారత్‌ ఆరాటపడుతుంటే.. మరోవైపు ఇదే ఊపులో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని విండీస్ చూస్తోంది.