ఐ‌పి‌ఎల్ 2020 ఫుల్ లిస్ట్ ఆఫ్ ట్రాన్స్ఫెర్స్

43
IPL 2020 Full List of Transfers

రిచెస్ట్ క్రికెట్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 13 వ సీజన్‌త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఇటీవల ఈ సీజన్‌కు సంబందించి ప్లేయర్ల మద్య ట్రేడింగ్ ముగిసింది. మొత్తం  ఫ్రాంచైజీలు అన్నీ కూడా జట్టులోని ఉత్తమ ఆటగాళ్లను పొందడానికి ఈ ట్రేడింగ్ ను చక్కగా ఉపయోగించుకున్నాయి.

గత సంవత్సరం సన్ రైజర్స్ హైదరాబాద్ నంబర్ వన్ ఆటగాడు మరియు భారత ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడటానికి ఎంచుకున్నాడు. పోయిన ఏడాది లానే ఈ సంవత్సరం ట్రేడింగ్ కూడా ఐపిఎల్ అభిమానులను ఎంతో ఆశ్చర్యం కలిగించింది. ఇటీవల, బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (దాదా) ఐ‌పి‌ఎల్ ప్రారంభోత్సవ వేడుక డబ్బు వృధా అని ప్రకటించారు. కాబట్టి, ఈ సీజన్ నుండి ఐపీఎల్‌కు ప్రారంభోత్సవ వేడుక ఉండదు.

ఇక ఈ సంవత్సరం ట్రేడింగ్ విషయానికి వస్తే:

ముంబై ఇండియన్స్ – ఢిల్లీ క్యాపిటల్స్ ట్రేడ్:

రాబోయే సీజన్‌కు న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌ను చేర్చుకున్నట్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ బుధవారం ప్రకటించింది. గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన బౌల్ట్ ఈ ఏడాది ముంబై ఇండియన్స్‌తో ఆడనున్నాడు. అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బౌల్ట్‌కు బదులుగా ముంబై ఏ ఆటగాడి ఎక్స్ఛేంజి చేస్తున్న పేరును ప్రకటించలేదు. బౌల్ట్ 2014 లో ఐపిఎల్‌లోకి అడుగుపెట్టాడు మరియు అప్పటి నుండి 33 ఐపిఎల్ మ్యాచ్‌లలో 38 వికెట్లు పడగొట్టాడు. ఈ అనుభవజ్ఞుడైన కివి ఫాస్ట్ బౌలర్‌కు ఈ సీజన్‌కు 2.2 కోట్లు చెల్లించబోతున్నారు.
నాలుగుసార్లు ఛాంపియన్స్ అయిన ముంబై ఇండియన్స్ వెస్ట్ ఇండీస్ ప్లేయర్ షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్‌ను తమ జట్టులో చేర్చుకుంది. వారు మయాంక్ మార్కండేను ఢిల్లీ కి ట్రేడ్ చేశారు . షెర్ఫేన్‌ను 2 కోట్ల తో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అదే విధంగా ఐపీఎల్ 2019 సీజన్లో పెద్దగా ప్రభావం చూపకపోవడంతో జట్టు నుండి మరో వెస్టిండీస్ బ్యాట్స్ మాన్ ఎవిన్ లూయిస్ ను విడుదల చేశారు.

రాజస్థాన్ రాయల్స్ షాకింగ్ ట్రేడ్:

ఈ సంవత్సరం షాకింగ్ ట్రేడ్లలో ఒకటి రాజస్థాన్ రాయల్స్  అజింక్య రహానెను విడిచి పెట్టడం. ఐపిఎల్ ప్రారంభం నుండి ఆర్ఆర్ జట్టులో పాల్గొన్న ఈ భారత టెస్ట్ వైస్ కెప్టెన్ వచ్చే సీజన్లో ఢిల్లీ కి ఆడబోతున్నాడు. ఇది ట్రేడింగ్ తేదీ చివరి రోజు అనగా నవంబర్ 14 న ఈ విషయాన్ని బి‌సి‌సి‌ఐ ప్రకటించింది. అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ లెగ్ స్పిన్నర్లు మయాంక్ మార్కండే, రాహుల్ తివాటియాలను రాజస్థాన్ రాయల్స్ కు  విడుదల చేసింది.రాజస్థాన్ తరఫున 100 కి పైగా మ్యాచ్‌లు ఆడిన రహానె ధర 4 కోట్లు.
రాజస్థాన్ జట్టు చేసిన మరో ముఖ్యమైన ట్రేడింగ్ ను పరిశీలిస్తే గత సంవత్సరం రాజస్థాన్ ముఖ్యమైన మ్యాచ్‌లు గెలవడానికి సహాయం చేసిన కృష్ణప్ప గౌతమ్‌ను విడుదల చేశారు, వారు కృష్ణప్ప గౌతమ్ కోసం పంజాబ్ నుండి అంకిత్ రాజ్‌పుత్‌ను ఎక్స్ఛేంజి చేశారు. అంకిత్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో 2018 వ సంవత్సరం నుండి టీమ్ లో  ఉన్నాడు మరియు ఇప్పటివరకు 23 ఐపిఎల్ మ్యాచ్లలో 22 వికెట్లు తీసుకున్నాడు.

కెప్టెన్ రవి చంద్రన్ అశ్విన్ ట్రేడ్:

ఇండియన్ ప్రైమ్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తదుపరి ఎడిషన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడనున్నాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కర్ణాటక స్పిన్నర్ జగదీషా సుచిత్ కోసం అతన్ని ఢిల్లీకి ట్రేడింగ్ చేసింది. గత రెండు సీజన్లలో పంజాబ్ కెప్టెన్‌గా ఉన్న అశ్విన్ను విడుదల చేశారు. అశ్విన్ 28 మ్యాచ్‌ల్లో పంజాబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు, అందులో పంజాబ్ 12 మ్యాచ్  లు  గెలిచి 16 ఓడిపోయింది. ఐపిఎల్‌లో ఆడిన 139 మ్యాచ్‌ల్లో అశ్విన్ 125 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ ధర 1.5 కోట్లు.
చివరిగా, ధావల్ కులకర్ణి రాజస్థాన్ నుండి ఢిల్లీ క్యాపిటల్స్ కు ట్రేడింగ్ చేయబడ్డాడు మరియు ఈ ఆటగాడి ధర 75 లక్షలు. ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి ఆడుతున్నకొద్ది మంది ఆటగాళ్లలో ఇతను ఒక్కరు.  పూర్తిగా పరిశీలిస్తే మన హైదరాబాద్ మరియు షారుఖ్ ఖాన్ కలకత్తా జట్ల నుండి ఎటువంటి ట్రేడింగ్ జరుగలేదు .