రోజా ఉందని జబర్దస్త్ ‘జడ్జీ’ గా రానని భీష్మించాడట

4
Bandla ganesh

ఎన్ని నిరసనలు వచ్చిన, ఎంత వివాదం జరిగినా పూడు పువ్వులు ఆరుకాయలుగా జబర్దస్త్ కామెడీ షో జనంలోకి బాగా దూసుకెళ్లి,టీఆర్ఫీ రేటింగ్ అమాంతం పెంచేసింది. ఈ షోను నిషేధించాలన్న ఆందోళన కూడా సాగినప్పటికీ , పేరుకు తగ్గట్టు ఈ షో దర్జాగా సాగిపోతూనే ఉంది. ఈ షో ద్వారా ఎందరో కంటెస్టెంట్స్ వచ్చి,సెలబ్రిటీలుగా మారారు. ఎందరో రైటర్స్, టెక్నీషియన్స్ కూడా వెలుగులోకి వచ్చారు. షో మొదలైన దగ్గర నుంచి నాగబాబు,రోజా జడ్జీలుగా ఉంటున్నారు.

ఈ షో ద్వారా మెగా బ్రదర్ నవ్వుల బాబుగా పేరొచ్చింది. షో ని కంట్రోల్ నడిపిస్తున్నాడన్న పేరూ వచ్చింది. ఈ షో వలన ఎమ్మెల్యే కాగలిగానని రోజా ఎన్నోసార్లు బహిరంగంగా చెప్పారు. అయితే ఈ షోలో కొన్ని తేడాలు బయట కొచ్చాయి. షో నడుస్తుందో లేదోనన్న అనుమానాలు వచ్చాయి. అయినా ఏమాత్రం రేటింగ్ తగ్గకుండా ముందుకు దూసుకెళ్తోంది. నాగబాబు ఈ షో నుంచి బయటకు వచ్చేసి జి తెలుగు అదిరింది షో లో జడ్జిగా చేస్తున్నాడు. అది కూడా జబర్దస్త్ లాగే కామెడీ షో యే.

నాగబాబు బయటకు వెళ్ళిపోయాక జబర్దస్త్ నిర్వాహకులపై కొన్ని ఆరోపణలు చేసారు. ఇక ఆయన స్థానాన్ని జబర్దస్త్ లో భర్తే చేయడానికి నిర్వాహకులు చాలా ప్రయత్నాలు చేసారు. అలీ,నరేష్,బండ్ల గణేష్ తదితరుల పేర్లు పరిశీలించారు. ఇందులో బండ్ల గణేష్ ని సంప్రదిస్తే, ఒప్పుకున్నాడట, ఎక్కువ రెమ్యునరేషన్ కూడా ఇవ్వాలని అనుకున్నారట. అయితే ఆ మధ్య పవన్ కళ్యాణ్ కి సంబంధించి, ఓ అంశంపై ఒక ఛానల్ లో నిర్వహించిన లైవ్ లో బండ్ల గణేష్,రోజా ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకున్నారట. ఆ ప్రోగ్రాంని సాకుగా చూపించి, రోజా ఉంటె తాను చేయనని బండ్ల గణేష్ చెప్పేశాడట.