కేంద్రంలోని బిజెపికి జగన్ సవాల్ విసురుతున్నాడా?

9
jagan

రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని వింటుంటాం. ఎత్తుకు పై ఎత్తులు,దెబ్బకు  దెబ్బ ఇవన్నీ మామూలే. నరసాపురం వైస్సార్ సిపి తరపున  ఎంపీ గా గెలిచిన పారిశ్రామిక వేత్త  రఘురామ కృష్ణంరాజు (రఘు)ను చేరదీస్తున్నందుకు… అదే జిల్లా, అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ  గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులపై వైసిపి  ‘ఆకర్ష్‌’ ప్రయోగించిందని అంటున్నారు.  ఇది ‘దెబ్బకు దెబ్బ’ అన్నట్లుగా కేంద్రానికి జగన్‌ విసురుతున్న సవాల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి

తెలుగుపై లోక్‌సభలో రఘు చేసిన ప్రసంగంపైనా జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నప్పటికీ… తమ పార్టీ ఎంపీ రఘును బీజేపీ ఉద్దేశపూర్వకంగానే చేరదీస్తున్నట్లు వైసీపీ అనుమానిస్తోంది.  అనేక సంవత్సరాలుగా బీజేపీలో ఉన్న మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ఆర్ ఎస్ ఎస్ తో చాలా దగ్గర సంబంధాలున్నాయి. అయితే ఆయన  కుమారుడు రంగరాజు, ఆయన సోదరులు రామరాజు, నరసింహరాజు సోమవారం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. సహజంగానే ఇది చర్చకు దారితీసింది.

వైసీపీకి చెందిన రఘుకు కేంద్రంలో మంచి ప్రాధాన్యం లభిస్తున్న కారణంగానే, రఘు సొంత జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాకే చెందిన, ఆయన సామాజిక వర్గానికే చెందిన గోకరాజు కుటుంబ సభ్యులను వైసీపీలో చేర్చుకున్నట్లు టాక్.  ఇటీవల ఆయనను ప్రధాని పలకరించి, పిలిచి కరచాలనం చేశారు. కేంద్ర మంత్రులను రఘు స్వేచ్ఛగా కలుస్తున్నారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభా పక్ష నేత మిథున్‌ రెడ్డి వేచిచూస్తుండగా ఆ తర్వాత వచ్చిన రఘుకు అమిత్‌షా నుంచి వచ్చినట్లు మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. మొత్తానికి ఆట రంజుగానే ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.