జగ్గూ భాయ్ ని పక్కన పెట్టేశారా?

3
jagapathi babu

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు టాప్ రేంజ్ కి వెళ్తామో ఎప్పుడు డౌన్ అయిపోతామో ఎవరికీ తెలీదు. ట్రెండ్ కి తగ్గట్టు మారుతూ వెళ్ళిపోవాలి. అయితే  ఫామిలీ ఓరియెంటెడ్ సినిమాల్లో హీరోగా మహిళా ప్రేక్షకాదరణ పొందిన   సీనియర్ హీరో జగపతిబాబు ఫేడ్ అవుట్ అయ్యే దశలో విలన్ గా ఎంట్రీ ఇచ్చి  సత్తా చాటాడు.  బోయపాటి-బాలయ్య సినిమా ‘లెజెండ్’ లో విలన్ గా ప్రవేశం చేసి,  అందరినీ ఆకర్షించాడు. జగపతి బాబు విలనిజం  కొత్త  ట్రెండ్ గా నిల్చింది.   అలా  సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన జగ్గు భాయ్ ఓ పక్క   క్యారెక్టర్ ఆర్టిస్టుగా, మరోపక్క  విలన్ గా  బిజీ అయ్యాడు.

ఒక దశలో  తమిళ.. మలయాళ చిత్రాల్లో కూడా నటించి, జగపతి బాబు  సౌత్ లోనే ఎక్కువ డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నిలిచాడు. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ‘రంగస్థలం’ లో విలన్ పాత్ర కూడా  మంచి పేరు తీసుకొచ్చింది. మరి  ఈ ఏడాది ఎందుకో జగపతిబాబు కి బ్రేక్ లు పడ్డాయని అంటున్నారు. తాజాగా మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న   ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో  ఒక ముఖ్య పాత్రకు మొదట జగపతిబాబునే తీసుకున్నప్పటికీ తర్వాత  ప్రకాష్ రాజ్ వైపు మొగ్గారు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన హిస్టారికల్ మూవీ  ‘సైరా’ లాంటి ఒకటి రెండు సినిమాల్లో నటించినా,మిగతా సినిమాల్లో ఛాన్స్ లు రాలేదు.అందుకే  ఈమధ్య జగపతి బాబుకి  ఆఫర్లు బాగా  తగ్గాయని టాక్ వైరల్ అయింది. కొత్త జెనరేషన్ ఫిలింమేకర్లు జగ్గు భాయ్ పేరును పరిశీలించడం లేదని, బాలీవుడ్ నటుల వైపై ముగ్గు చూపుతున్నారని  వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో జగపతి బాబు ఎలా నెగ్గుకొస్తాడో చూడాలి.