జేడీ కూడా జనసేనకు గుడ్ బై ?- కమలం వైపు చూపు?

8
Jd laxminarayana

    ఇప్పటికే జనసేననుంచి ఒక్కక్కరు బయటకు వచ్చేస్తున్నారు. ప్రస్తుతం జనసేనలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న  సీబీఐ మాజీ అధికారి జేడీ లక్ష్మీనారాయణ ఆ పార్టీ నుంచి తప్పుకోడానికి రంగం సిద్ధం చేసుకున్నారని టాక్.  స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఈయన  పార్టీ పార్టీ పెట్టాలని భావించడం, అన్ని పార్టీల నుంచి ఆహ్వానం అందడంతో  టీడీపీతో చర్చలు జరిపి జనసేనలో చేరిపోయారు. ఆయనకు విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పార్టీ అధినేత పవన్ టికెట్ ఇచ్చారు. ఎన్నికల్లో  ఓటమి పాలయ్యారు.
    ఇప్పుడు  లక్ష్మీనారాయణ బీజేపీ వైపు దృష్టి పెట్టరారట. బీజేపీ ఆయన వైపు చూస్తోందని,  ఓ ముఖ్యనేత మంతనాలు చేస్తున్నట్లు వినిపిస్తోంది.  ఎన్నికల్లో ఓటమి అనంతరం జనసేనలో  అంత క్రియాశీలంగా పార్టీలో పనిచేయడం లేదు. అయితే లక్ష్మీనారాయణకు రాయలసీమలో పార్టీని బలోపేతం బాధ్యత  పవన్ కళ్యాణ్  అప్పజెప్పారు. కానీ  లక్ష్మీనారాయణ అంతగా  పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బలపడాలని ప్రయత్నిస్తున్న బీజేపీ, లక్ష్మీనారాయణపై కన్నేసినట్లు, టీడీపీ నుంచి బీజేపీలోకి జంపయిన ఎంపీ సుజనాచౌదరి ఈ మేరకు మంతనాలు జరుపుతున్నట్లు  ప్రచారం జరుగుతోంది.

   ఇది నిజమైతే  పవన్ కళ్యాణ్ కు అది ఊహించని షాక్ అవుతుందని అంటున్నారు. రాష్ట్రంలో జనసేన రోజురోజుకూ బలహీన పడుతోందని,ముఖ్యనేతలు సైతం  గుడ్ బై చెప్పేస్తున్నారని, ఈదశలో జాతీయ పార్టీ అయిన బీజేపీలో చేరితే భవిష్యత్ ఉంటుందని, జేడీ లక్ష్మీనారాయణకు బిజెపి నేతలు చెప్పుకొస్తున్నారని టాక్.   ఇప్పటికే ఒకసారి పార్టీ మారుతున్నట్లు వార్తలొస్తే, జేడీ లక్ష్మీనారాయణ ఖండించారు. అయితే ఇప్పుడు వస్తున్నా  తాజా పుకార్ల నేపథ్యంలో అసలు ఆయన వైఖరేమిటో తేల్చాలి ఉంది.