ఆ రైటర్ కి కోపం తెప్పించిన వర్మ.. సూటిగా ప్రశ్నలు..!!

29
Jonavitthula fires on RGV

వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కు వివాదాలు కొత్తమీ కాదు..ప్రస్తుతం జొన్నవిత్తుల vs వర్మ నడుస్తుంది. వర్మ తాజాగా చేస్తున్న ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు విమర్శలు చేసారు. దీంతో జొన్నవిత్తులపై వర్మ ఎదురు దాడి చేసారు. ఓ రేంజ్‌లో అయన ఫై సెటైర్స్ వేసి వార్తల్లో నిలిచారు.

వర్మ సెటైర్స్ హార్ట్ అయినా జొన్నవిత్తుల..వర్మ కు కొన్ని సూటి ప్రశ్నలు వేశారు. మెగా ఫ్యామిలీ సినిమా తీస్తానని ప్రకటించి ఎందుకు వెనక్కి తగ్గాడని ప్రశ్నించారు. మెగా ఫ్యామిలీ నుంచి ఏ మొనగాడు ఫోన్ చేస్తే వెనక్కి తగ్గావని నిలదీశారు. నీకు నిజంగా దమ్ముంటే ‘మెగా ఫ్యామిలీ’ తీసేవాడివి కదా అని మండిపడ్డారు. అయితే వర్మ మాత్రం జొన్నవిత్తుల మాటలను అసలు పట్టించుకోకుండా..’జొన్న పొత్తు’తో ఇక చాలు ఇక మరో జోకర్ పౌలి బాయ్ పాట వినండి అంటూ దాని లింక్ పోస్ట్ చేశాడు.