కర్ణాటకలో అగ్రనేతల మంతనాలు – బిజెపి శ్రేణుల్లో  ఆనందం

5
karnataka-bjp

    కర్ణాటక బీజేపీలో  ప్రధాన శత్రువులుగా  కొనసాగిన పార్టీ  అగ్రనేతలు అయిన ముఖ్యమంత్రి యడియూరప్ప నివాసానికి బీజేపీ జాతీయ సంఘటనా సహ కార్యదర్శి బి.ఎల్‌.సంతోష్‌ చేతులు కలిపారు. దీంతో  పార్టీ వర్గాలలో సహజంగానే  సంతోషం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి యడియూరప్ప నివాసానికి సంతోష్‌ సోమవారం  వెళ్ళారు. ఇరువురూ అరగంటకుపైగా రహస్యంగా మంతనాలు సాగించారు. మంత్రివర్గ విస్తరణ, శాఖల మార్పు, ఉపముఖ్యమంత్రుల కేటాయింపు వంటి అంశాలపై చర్చించుకున్నట్టు టాక్.ఎన్‌ఆర్‌సిని కర్ణాటకలో పకడ్బందీగా అమలు చేసే విధానంపై చర్చకు వచ్చిందంటున్నారు.

   రాష్ట్రంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా వ్యవహరించిన సంతోష్‌ గత కొన్నేళ్ళుగా యడియూరప్పకు శత్రువు గానే  వ్యవహరించారు. సంకీర్ణ ప్రభుత్వం కూల్చే విషయంలోనూ అంతకుముందు లోక్‌సభ ఎన్నికల్లోనూ సంతోష్‌ నానా ఇబ్బందులు పెట్టారు. ఇటీవలే సంతో‌ష్‌ను జాతీయ స్థాయికి పంపారు. అయినా రాష్ట్ర రాజకీయాలను సంతోష్‌ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆయన నేరుగా యడియూరప్ప నివాసానికి వెళ్ళడం వెనుక భారీ వ్యూహమే ఉంటుందనిపిస్తోంది.

 ఇక  మూడు రోజులక్రితం యడియూరప్ప కుమారుడు బి.వై.విజయేంద్ర, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను ఢిల్లీలో కలసిన విషయం తెలిసిందే. ఉప ఎన్నికల్లో 12 స్థానాలతో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వానికి ఢోకా లేదనే సంకేతం వచ్చింది. దీంతో యడియూరప్పను వ్యతిరేకించడం సరికాదని సంతోష్‌ భావించినట్టు టాక్. ఈదశలో  అమిత్‌షా సూచనలకు అనుగుణంగానే యడియూరప్పను కలసి పలు అంశాలపై చర్చించినట్టు వినిపిస్తోంది