రాజధాని గురించి కేఈ భలే చెప్పారు

9
ke krishnamurthy

ప్రస్తుతం ఎక్కడ చూసినా రాజధాని అంశంపైనే చర్చ జోరుగా నడుస్తోంది. ఎవరి రేంజ్ లో వాళ్ళు స్టేట్ మెంట్స్ అదరగొట్టేస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఉంటే అమరావతి రాజధానిగా ఉండాలని, లేదంటే కర్నూలును చేయాలని ఆయన స్పష్టం చేశారు. హైకోర్టు అడుగుతున్నామంటే రాజధానిని కూడా అడుగుతున్నట్లేనని ఆయన లాజిక్ గా తేల్చిచెప్పారు.

నంద్యాల లోక్‌సభ టీడీపీ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డితో కలిసి కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో కె ఈ మీడియాతో మాట్లాడుతూ ‘‘ రాయలసీమ నుంచి ఇంత మంది ముఖ్యమంత్రులు అయ్యారు.అయినా ఇప్పుడు రాయలసీమ పరిస్థితి ఏమిటి? హైకోర్టు ఎక్కడ ఉంటుందో రాజధాని కూడా అక్కడే ఉండాలి. దీనిపై త్వరలో యాత్రకు శ్రీకారం చుడతాం’’ అని ప్రకటించారు.
వైజాగ్‌లో రాజధాని నిర్మాణానికి ఖర్చు ఎక్కువతుందని, ఓర్వకల్లులో 30వేల ఎకరాలు ఉందని, ఖర్చు కూడా తక్కువగా ఉంటుందని కె ఈ సూచించారు. అమరావతి పరిరక్షణకు జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్రను అడ్డుకుని, టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్‌ చేయడం అప్రజాస్వామికమని ఆయన ఖండించారు. అయినా సీఎం జగన్ ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు.