మహేష్ అల్లు అర్జున్ ల సీక్రెట్ మీటింగ్ వెనుక ఇంత కథ ఉందా..!!

21
AA-Mahesh

అల్లు అర్జున్ మహేష్ బాబుల మధ్య సీక్రెట్ మీటింగ్ జరిగిందని తెలుస్తోంది. వీరి మధ్య ఈ మీటింగ్ ని అరేంజ్ చేసింది ప్రముఖ నిర్మాత దిల్ రాజు అనే వార్తలు వస్తున్నాయి. దిల్ రాజ్జ్ తో మహేష్ బన్నీలకు ఉన్న సానిహిత్యం రీత్యా ఈ సీక్రెట్ మీటింగ్ కు వీరిద్దరు రావడమే కాకుండా దిల్ రాజ్ సూచించిన రాజీ మార్గానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. అనూహ్య రీతిలో ఈ ఇద్దరూ జనవరి 12వ తేదీని విడుదల తేదీగా ప్రకటించడం ఆశ్చర్యం కలిగించిన నేపధ్యంలో ఈ ఇద్దరి మధ్య స్టార్ వార్ వార్ అనివార్యమైంది.

‘అల వైకుంఠపురములో’ సరిలేరు నీకెవ్వరు’ మూవీలకు సంబదించి ఒక రాజీ మార్గం కుదిరింది అన్న ప్రచారం మొదలైంది అన్న వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను జనవరి 13న రిలీజ్ చేయాలని అలాగే ‘అల వైకుంఠపురములో’ సినిమాను జనవరి 11న విడుదలచేయడానికి ఈ టాప్ హీరోలు ఇద్దరు తమ ఇగోలను పక్కకు పెట్టి దిల్ రాజ్ రాజీ నార్గానికి వాస్తవ పరిస్థితులు గ్రహించి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

గతంలో కూడా మహేష్ ‘భరత్ అను నేను’ అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ సినిమాల విషయంలో ఇలా క్లాష్ వస్తే ఇలాగే సద్దుబాటు చేసుకున్నారు. ఇప్పుడు ఈ రాజీ మార్గం వల్ల వీరిద్దరూ లాభ పడతారా లేకుంటే వీరిద్దరిలో ఒకరే లాభ పడతార అన్న విషయమై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుతం వీరిద్దరి మధ్యా రాజీ కుదిరినా మహేష్ బన్నీ అభిమానుల మధ్య ఎప్పటి నుంచో గ్యాప్ కొనసాగుతున్న నేపధ్యంలో అభిమానులు మాత్రం ఈ వార్ ను సీరియస్ గా తీసుకుని నెగిటివ్ టాక్ ను ప్రచారం చేయడంలో తమ వంతు పాత్ర పూర్తిగా పోషిస్తారు అనడంలో ఎటువంటి సందేహంలేదు..