ఫిలింనగర్ మహేష్ ఇల్లు చూస్తే వావ్ అనాల్సిందే…

6
Mahesh house

   సూపర్ స్టార్ మహేష్ – నమ్రత ల ను చూస్తే భర్త కెరీర్ లో ఆమె పాత్ర స్పష్టం అవుతుంది.  మహేష్ స్టార్ డమ్ వెనక నమ్రత ప్లానింగ్ ఎక్కువే అని చెప్పాలి   అన్నీ తానై  అంచెలంచెలుగా ఎదిగేందుకు, స్టార్ ని చేయడంలో అలాగే బిజినెస్ మేన్ గా రూపాంతరం చెందించడంలోనూ నమ్రత ప్రణాళికా బద్ధమైన  పాత్ర ఉందంటారు.   ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌళిలో ఏఎంబీ సినిమాస్ ని ఇంద్రభవనంలా నిర్మించడంలో నమ్రత ప్లానింగ్, కమ్యూనికేషన్, అభిరుచి కనిపిస్తాయని   సన్నిహితులు చెబుతారు.

      దాదాపు ఏడెనిమిదేళ్ల క్రితం హైదరాబాద్ ఫిలింనగర్ లో మహేష్ సొంతంగా ఓ ఖరీదైన ఇంటిని నిర్మించుకున్నాడు.ఈ ఇంటికి సంబంధించిన ఇంటీరియర్ సహా ప్రతిదీ నమ్రతనే దగ్గరుండి డిజైన్ చేయించారని అప్పట్లో చెప్పుకున్నారు. ముంబైకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ ఈ ఇంటిని డిజైన్ చేశారు. ఎంట్రన్స్ లో ఉడ్ వర్క్,  కింద గెస్ట్స్ వెయిటింగ్ రూమ్, పైన సకల సౌకర్యాలతో బెడ్ రూమ్స్ వగైరా అన్నీ డిజైనింగ్ చేయించుకునేందుకు నమ్రత చాలానే హార్డ్ వర్క్ చేసినట్లు చెబుతారు.

      తాజాగా తమ ఇంటికి సంబంధించిన ఫోటోల్ని నమ్రత సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. అత్యంత ఖరీదైన ఈ డిజైనర్ హోమ్ ని చూడగానే షాకవ్వాల్సిందే. ఇందులో  ఓ ఫోటో చాలా స్పెషల్ గా ఆకట్టుకుంది. నమ్రత స్వయంగా ఫోటోలు తీస్తున్నప్పుడు ఓ ఫోటోలో తన ప్రతిబింబం నీడ హైలైట్ అయ్యింది. కిడ్స్ గౌతమ్ – సితార ఇంట్లో `లూడో` అనే గేమ్ ఆడుతున్నప్పుడు తీసిన ఫోటోల్ని నమ్రత ఇంతకుముందు రివీల్ చేస్తే అవి హైలైట్ గా నిలిచాయి.  తాజాగా రివీల్ చేసిన ఫోటోల్లోనే నమ్రత ఫ్యామిలీ మెంబర్స్ సహా బంధుమిత్రులు ఉన్నారని అర్థమవుతోంది.