నేను బతికుండగా అది జరగదు

4
mamata banerjee

కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన సీఏఏ, నిర్బంధ కేంద్రాలపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో ఆమె పాల్గొని, ఉద్వేగభరితంగా మాట్లాడారు. తాను బతికుండగా పౌరసత్వ సవరణ చట్టాన్ని బెంగాల్‌లో అమలు కానివ్వనని మరోసారి తేల్చి చెప్పేసారు.
అదే విధంగా నిర్బంధ కేంద్రాలను కూడా ఏర్పాటు కానివ్వనని స్పష్టం చేశారు. అస్సాం అనంతరం బెంగాల్ సహా దేశం మొత్తం ఎన్నార్సీని అమలు చేస్తామని బీజేపీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. ఇదే సమయంలో పౌరసత్వ సరవణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీంతో సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా దేశంలోని పలుచోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎన్నార్సీని అమలు చేస్తే అందులో పేరును కోల్పోయిన వారిని అక్రమ వలసదారులుగా భావించి, నిర్బంధ కేంద్రాలకు తరలిస్తారనే ప్రచారం విస్తృతంగా జరిగింది. దీనిపై తాజాగా స్పందించిన మమతా బెనర్జీ తనదైన శైలిలో షాకింగ్ కామెంట్స్ చేశారు. మొత్తానికి నోట్ల రద్దు నాటి నుంచి బిజెపి తో మమత తలపడుతూనే గట్టి ఫైట్ ఇస్తున్నారు.