క్యాబ్ ఆందోళనలపై మోదీ షాకింగ్ కామెంట్స్

5
Modi shocking comment on cab

పౌరసత్వ సవరణ చట్టం(క్యాబ్) పై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం జరిగిన భారీ ర్యాలీలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేసారు. సీఏఏ, ఎన్నార్సీ భారతీయ ముస్లింలపై ఎలాంటి ప్రభావం చూపవని స్పష్టం చేశారు. భారతీయ ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని ఆయన హామీ ఇచ్చారు. అయితే పౌరసత్వ సవరణ చట్టంతో కొత్తగా వచ్చే శరణార్ధులకు ఎలాంటి ప్రయోజనం లభించదని ప్రధాని అన్నారు. ఈ విషయంలో పట్టణ ప్రాంతాల్లోని విద్యావంతులైన నక్సల్స్‌.. ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు.
‘ కావాలంటే నన్ను ద్వేషించండి, నా దిష్టిబొమ్మలు దగ్దం చేయండి. కానీ భారత్‌ను మాత్రం ద్వేషించకండి’ అని ప్ర మోదీ పేర్కొన్నారు. క్యాబ్ కి వ్యతిరేకంగా విపక్షాల ప్రచారం, ఆందోళనలను ఆయన దుయ్యబట్టారు. కావాలంటే తనను ద్వేషించాలని… అంతేకానీ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయవద్దని కోరారు. ‘పౌరసత్వ చట్టంపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టంపై సోషల్‌ మీడియాలో తప్పుడు పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ చట్టాన్ని తీసుకొచ్చిన పార్లమెంట్‌కు ధన్యవాదాలు చెప్పండి’అని మోదీ కోరారు.

అబద్ధాలు ప్రచారం చేసేవాళ్లను నమ్మొద్దని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించేందుకే విపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని, జాతి, మతాలను చూడకుండా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని ప్రధాని తెలిపారు. అలాగే పోలీసులపై ఆందోళనకారులు దాడులు చేయడాన్ని ప్రధాని మోదీ ఖండించారు. ఇలాంటి చర్యలు సరికాదన్నారు.