కమలం గూటికి మోహన్ బాబు?

4
mohan babu jumps bjp

ప్రముఖ సినీ నటుడు, కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు బిజెపి తీర్ధం పుచ్చుకోబోతున్నారా? ఇప్పటికే దీనిపై వార్తలు వైరల్ అయ్యాయి. దీనికి కారణం లేకపోలేదు. కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ వెళ్లిన మోహన్ బాబు అక్కడ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. మోహన్‌బాబుతోపాటు ఆయన కుమారుడు మంచు విష్ణు, కోడలు వెరోనికా, కుమార్తె మంచు లక్ష్మి మోదీని కలిసినవారిలో ఉన్నారు. ప్రధానితో సమావేశం చాలా బాగా జరిగిందని మంచు విష్ణు ట్వీట్‌ చేశారు.

విష్ణుమూర్తి దశావతారలతో కూడిన పెయింటింగ్‌ను మోదీకి బహుకరించినట్టు విష్ణు చెప్పారు. ‘దక్షిణాదికి చెందిన సినీ ప్రముఖలతో ఒక్కసారి సమావేశం నిర్వహించా లని మోదీని కోరాను. దానిని ఆయన వెంటనే అంగీకరించారు. త్వరలోనే ఈ భేటీ ఉంటుందని ఆశిస్తున్నాను’ అని విష్ణు ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా ప్రధాని మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాపై మోహన్ బాబు ప్రసంశలు కురిపించార ని తెలుస్తోంది.
దేశాన్ని గొప్ప స్థానంలో నిలిపిన వ్యక్తి మోదీ అని, హోంమంత్రి పదవికే వన్నె తెచ్చిన నేత అమిత్ షా అని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. మోదీ, షాలతో భేటీలో ఏం మాట్లాడుకున్నామో త్వరలోనే వెల్లడిస్తానని మోహన్ బాబు స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఆప్యాయంగా పలకరించడం, ప్రేమగా మాట్లాడటం కంటే ఏం కావాలి? అని పేర్కొన్నారు. బీజేపీలోకి ఆహ్వానించారన్న దానిపై ఇప్పడేమీ చెప్పనని మోహన్‌బాబు అన్నారు . ఏపీలో సీఎం జగన్ మంచి పాలన అందిస్తున్నారన్నారు. మొత్తానికి ఏపీలో రాజకీయ సమీకరణాలు ఊపందుకోనున్నాయి.