జనసేనలో ముసలం!! – నాదెండ్ల గుడ్ బై చెప్పేస్తున్నారా?

12
Nadendla Manohar To Quit Janasena Party

డబ్బులు ఊరికే రావు అనే డైలాగ్ చూసాం కానీ పార్టీ నడపడం అంటే అంత ఈజీ కాదనే డైలాగులు వినిపిస్తుంటాయి. ఇప్పుడు   జనసేన విషయంలో అదే జరుగుతోంది. తాజాగా ఆపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రకటనలు ఆ  పార్టీలో  ముసలం పుట్టిస్తున్నాయని టాక్. పార్టీ భారం  మోయలేకనో, బీజేపీ అధిష్ఠానమిచ్చిన ఆఫరో తెలియదు గాని జనసేనను కమలం పార్టీలో విలీనం చేయాలని పవన్ భావిస్తున్నట్లు  ప్రచారం జోరందుకుంది.

ఇటీవల ఢిల్లీ వెళ్లిన పవన్ అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అప్పుడే జనసేనను బీజేపీలో విలీనం చేస్తే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని అమిత్ షా ఆఫర్ ఇచ్చినట్లుగా టాక్. దీంతో పవన్ బీజేపీలో పార్టీని విలీనం చేయడానికి ఆసక్తిగా ఉన్నారని, అందుకే  అమిత్ షా అంటే తనకెంతో ఇష్టమని – గౌరవమని వ్యాఖ్యానించారని   రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.   కాగా  జనసేనలో చేరినప్పటి నుంచి పవన్ ని  వెన్నంటి ఉంటున్న మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఇప్పుడు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారట.
బీజేపీతో పవన్ దోస్తీ ఆయనకు ఎంతమాత్రం నచ్చడం లేదట. తనకు మాట మాత్రంగా నైనా చెప్పకుండా కీలక నిర్ణయం తీసుకోవడంపై ఆయన కినుక వహించారని జనసేన వర్గాల్లో చర్చలు సాగుతోంది.

మనోహర్ పార్టీకి దూరమైతే ఆ పార్టీలో పెద్దగా  నాయకులెవరు ఉండరని అంటున్నారు.  ప్రజా సమస్యల విషయంలో పవన్ తో కల్సి నాదెండ్ల  పోరాటం చేశారు. పార్టీ ఓడిపోయినా సరే  పవన్ వెంటే ఉండడంతో పార్టీలో  నెంబర్ 2 అన్న నమ్మకం  ఏర్పడింది. కానీ పవన్ చేస్తున్న వ్యాఖ్యలు మనోహర్ కు చిరాకు తెప్పిస్తున్నాయట. పవన్ ఎప్పుడు ?  ఏం మాట్లాడుతున్నాడో ?  తెలియక ఒక్క మనోహర్ మాత్రమే కాదు.. జనసేన కీలక నాయకులు సైతం షాక్ అవుతున్నారట.