మహేష్ కోసం నమ్రత డాన్స్ కి ప్రిపేర్

8
namratha dance prepare for mahesh babu

ప్రస్తుతం సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు హీరోగా సరిలేరు నీకెవ్వరు చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అయ్యింది. ఎఫ్ 2తర్వాత అనీల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ చిత్రం ప్రమోషన్‌ ను జోరుగా చేస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్‌ బాబుకు జోడీగా రష్మిక మందన్న నటించింది. లేడి అమితాబ్ విజయశాంతి ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నందున భారీ అంచాలు ఉన్నాయి

సంక్రాంతికి ప్రేక్షకులను డబుల్‌ ఎంటర్‌టైన్‌ చేయడం ఖాయం అంటూ మహేష్‌బాబు ఫ్యాన్స్‌ చాలా హాప్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌లు సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తున్నాయి. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ చిత్రంను దర్శకుడు అనీల్‌ రావిపూడి తెరకెక్కించాడని అంటున్నారు. అయితే మామూలుగా తెర వెనక ఉండి వ్యవహారం నడిపించే మహేష్ భార్య నమ్రత ఈసారి తెరపై కనిపించబోతుందట.

అసలు విషయం ఏమిటంటే సినిమా ప్రమోషన్స్‌ కోసం నమ్రత కూడా రంగంలోకి దిగినట్లు టాక్. సాదారణంగా స్టార్‌ హీరోల పాటలకు, అలాగే సక్సెస్‌ అయిన పాటలకు కవర్‌ సాంగ్‌ వీడియోలు చేయడం ఈమధ్య కొత్తగా వచ్చింది. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమాలోని ‘హి ఈజ్‌ సో క్యూట్‌ ‘ పాటకు నమ్రత కవర్‌ సాంగ్‌ చేయబోతుందట.అంటే ఆ పాటకు నమ్రత డాన్స్‌ చేసి వీడియో విడుదల చేయడం ద్వారా కొత్త సంవత్సరం కానుకగా విడుదల చేసి మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ కు విషెష్ చెబుతుందట.