More
  Home రాజకీయం మా ఆస్తులివే - మరి మీరూ చెప్పగలరా?

  మా ఆస్తులివే – మరి మీరూ చెప్పగలరా?

     వైసిపి,టిడిపి నేతల మధ్య ఏదోఒక అంశం మీద నిత్యం గొడవ జరుగుతూనే ఉంది. అయితే తాజాగా ఐటి రైడ్స్ మీద ఆరోపణలు ప్రత్యారోపణ పర్వం సాగుతోంది. ఈనేపధ్యంలో   ఫామిలీ ఆస్తుల వివరాలను నారా లోకేష్‌  గురువారం మంగళగిరి టీడీపీ ఆఫీసులోప్రకటించారు. చంద్రబాబు ఆస్తులు గత ఏడాదితో పోలిస్తే రూ.85 లక్షలు పెరిగాయని తెలియజేశారు. చంద్రబాబు నికర ఆస్తి 3.87 కోట్లు.. అప్పులు రూ.5.13 కోట్లు ఉన్నాయని తెలిపారు. ఇక తన తల్లి భువనేశ్వరి ఆస్తి రూ.53 కోట్ల నుంచి రూ.50 కోట్లకు తగ్గిందని చెప్పుకొచ్చారు. నారా లోకేష్ ఆస్తి 24 కోట్లు. బ్రాహ్మణి ఆస్తి 15 కోట్ల 68 లక్షలు. దేవాన్ష్‌ ఆస్తి 19 కోట్ల 42 లక్షలుగా ఉన్నాయని వివరించారు. ఇక తన పేరిట ఉన్న షేర్లు బ్రాహ్మణికి బహుమతిగా ఇచ్చినట్లు వెల్లడించారు.

   

   తనను విమర్శించే వాళ్లంతా ముందు మీరు మీ ఆస్తులు ప్రకటించాలని  లోకేష్‌ డిమాండ్ చేశారు. ‘‘బినామీ భూములు, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ ఆరోపణలు చేస్తున్నారు.. వైసీపీ ప్రభుత్వం వచ్చి 9 నెలలైంది.. ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు. క్రమశిక్షణ, పట్టుదలతో వ్యాపారం, రాజకీయాలు చేస్తున్నాం. కావాలనే మాపై ఆరోపణలు చేస్తు న్నారు. పీఏ శ్రీనివాస్‌ ఇంట్లో ఐటీకి రూ.2.68 లక్షలు దొరికాయి. ఆయనకే తిరిగి ఇచ్చే శారు. మేం ఏనాడు తప్పు చేయలేదు. ఏం దొరకనప్పుడు ఏం చెప్పాలి?. నిండా ముని గిన వాళ్లు ఏం మాట్లాడరు కానీ, ఏం దొరికాయని  సమాధానం చెప్పాలి’’ అని నిలదీశారు.

     జగన్‌ 43 వేల కోట్ల అవినీతి రుజువైందని నారా లోకేష్ అన్నారు. జగన్‌లా మేం బినామీలు కంపెనీలు పెట్టలేదని చెప్పారు. బినామీ కంపెనీల ద్వారా ఇళ్లు కట్టలేదు.. కార్లు కొనలేదని పేర్కొన్నారు. తుగ్లక్ ఆస్తులు ఈడీ, సీబీఐ ప్రకటిస్తుందని ఎద్దేవా చేశారు. వైసీపీలో కోడిగుడ్డు మీద ఈకలు పీకే బ్యాచ్ ఉందని మండిపడ్డారు. 9 ఏళ్లుగా ఆస్తులు ప్రకటిస్తున్న రాజకీయ కుటుంబం మాదని   చెప్పారు. ఆస్తుల విలువ మార్కెట్ విలువ ప్రకారం లెక్కలు వెయ్యలేదన్నారు.

  Recent Posts

  తారక్ సరసన జాన్వీ కపూర్

  Jr NTR to romance with Janhvi Kapoor in Trivikram movie: జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్లో వచ్చిన తొలిచిత్రం అరవింద సమేత బ్లాక్ బస్టర్ అయింది. ఎన్టీఆర్ నుండి కొత్తరకం...

  మోడీ చర్యలు భేష్ అంటున్న చంద్రబాబు …….. 

  N Chandrababu Naidu appreciated Prime Minister Narendra Modi: మహమ్మారి కరోనా నేపథ్యంలో  లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో ఎవరూ పస్తులు ఉండకూడదన్న ఉద్దేశంతో కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ ప్రధాని మోదీ ప్రభుత్వ...

  శ్రీవారి అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంది 

  TTD gives clarity over Akhanda Jyothi కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ అమలవుతోంది. ఇక అన్ని ఆలయాలు కూడా మూసేసారు. భక్తులను అనుమతించకపోయినా ప్రధాన ఆలయాలలో నిత్య  సేవలు జరుగుతూన్నాయి. అయితే...

  ప్రజలు కూడా బాగస్వామ్యాలు కావాలి – ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ

  కరోనా వైరస్ పై ప్రభుత్వం చేసే పోరాటంలో ప్రజలు కూడా బాగస్వామ్యాలు  కావాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ  శనివారం పిలుపునిచ్చారు. ఆరోగ్యకరమైన భారతదేశాన్ని సృష్టించడంలో తనవంతు సాయం ప్రతి ఒక్కరూ చేయాలియని...

  ఒలింపిక్స్‌ డేట్స్ ఫిక్స్  

  Tokyo Olympic New dates announced: ఈ ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్   మహమ్మారి   కరోనా వైరస్‌ కారణంగా వాయిదా వేస్తూ జపాన్ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది వరకూ వాయిదా వేస్తున్నట్లు...

  అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న ఎక్సైజ్ సిఐ

  ఏపీలో మామూలుగానే వైన్ షాపులు బంద్ అలాంటిది కరోన నేపథ్యంలో మొత్తానికి లాక్ డౌన్ లో ఉండటం వల్ల మొత్తానికే బంద్.  వైన్ షాపులు బంద్ కావడంతో మందుబాబులు అక్కడ అక్కడ చాలా...