నిఖిల్ చేతికి పైరసీ సిడిలు ఎలా వచ్చాయ్……….

8

ఎన్నోకోట్లు ఖర్చు చేసి భారీగా సిన్మాలు తీస్తుంటే, పైరసీ భూతం సినీపరిశ్రమల్ని అతలాకుతలం చేసేస్తోంది.  ఇలా రిలీజైన సినిమా అలా పైరసీ అయ్యిపోతోంది. అంతేకాదు  బహిరంగ మార్కెట్లో సీడీలు – డీవీడీల రూపంలో అందుబాటులోకి వచ్చేస్తున్నాయి.  ప్రస్తుతం థియేటర్లలో ఆడుతున్న సినిమాలన్నీ అప్పుడే నడిరోడ్లులో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ప్రతి శుక్రవారం రిలీజయ్యే సినిమాల పరిస్థితి ఇలాగే ఉంటోంది.  అసలు ఈ పైరసీ ఎక్కడ పుడుతోంది?  ఎలా పుడుతోంది? దీనికి ఎవ్వరూ పరిష్కారం కనుక్కోలేకపోతున్నారు. తమిళ్ రాకర్స్ సహా తెలుగు ఇండస్ట్రీలోనూ పైకి కనిపించని మాఫియా రన్ అవుతోందన్నది చాలామంది ఆరోపణ.

ఫిలింఛాంబర్ లో పైరసీ సెల్ అందులో ఉద్యోగులు ఏమీ చేయలేకపోతున్నారు.  సైబర్ పోలీస్ సైతం కొంతకాలం హడావుడి చేసినా పూర్తిగా పైరసీని కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారనే చెప్పాలి. తాజాగా యంగ్ హీరో నిఖిల్ ఓ పైరసీ సీడీల షాప్ ని బహిరంగంగా పట్టుకున్నాడు. తాను నటించిన అర్జున్ సురవరం ఇంకా థియేటర్లలో ఆడుతుండగానే, సీడీలు విక్రయిస్తున్న తోపుడు బండిని డైరెక్టుగా వీడియో సాక్షిగా చూపించాడు. రాజుగారి గది.. అర్జున్ సురవరం సహా ఇటీవల రిలీజైన సీడీలు అన్నీ ఆన్ రోడ్ షాప్ లో అమ్మేస్తున్నారు.

రోడ్ లో టీ తాగేందుకు ఆగి నడిరోడ్డుపై తోపుడు బండిపై ఉన్న సీడీ షాప్ ని పట్టుకోవడం షాక్ కి గురిచేసింది.  ఆ సీడీలు అమ్మే ఆవిడను నిఖిల్ పబ్లిగ్గా పట్టుకుని సినిమావాళ్ల బాధల్ని వివరించాడట.  రూ.40 కే మూడు సినిమాలు ఒకే సీడీలో లభ్యమవుతున్నాయి. ఓవైపు సినిమా థియేటర్లలో బాగా ఆడుతోందన్న ఆనందం ఉంది. మరోవైపు ఇలా సీడీలు అమ్మేస్తున్నారు! అంటూ ఆవేదన చెందాడు.  ఇక ఆ సీడీ బండి ఆవిడ కుటుంబం విషయంలో విచారం వ్యక్తం చేస్తూనే ఒక్కో సినిమాపై ఆధారపడి జీవించే 800 మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడతాయని చెప్పుకొచ్చాడట పాపం. ఎన్ని చెప్పినా పైరసీ భూతం ఆగుతుందా?