రాజధానిపై  పవన్ రివర్స్ గేర్ – విమర్శల వెల్లువ

7
Pawan

      ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియకుండా  జనసేన అధిపతి పవన్ కల్యాణ్..ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతూ ఉంటాడు.  ప్రాంతీయ విద్వేషపు మాటలను కూడా మాట్లాడాడు. గోదావరి జిల్లాలకు వెళ్లి.. రాయలసీమ ఫ్యాక్షనిస్టులు వస్తే తను తోలు తీస్తా అంటూ పవన్ మాట్లాడాడు. ఇక రాయలసీమకు వెళ్లి.. అక్కడ అక్కడి జనాలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేశాడు. అయితే  ఆయన పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. రాయలసీమలోనూ ఆయనకు ఓటు బ్యాంకు ఏ మాత్రం కనిపించలేదు. దీంతో  ఏ ప్రాంత ప్రజలూ పవన్ కల్యాణ్ ను నమ్మలేదు.    ఇలా ఎవ్వరిలోనూ విశ్వసనీయతను సంపాదించుకోలేకపోయిన పవన్ కల్యాణ్ .. ఇప్పుడు రాజధాని అంశం గురించి కూడా విమర్శలు గుప్పించడంతో గతంలో ఆయన ఏమన్నాడు,ఇప్పుడు ఏమంటున్నాడ ని విమర్శిస్తున్నారు.  ఏపీ సీఎం జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశాన్ని పవన్ కల్యాణ్ వ్యతిరేకించాడు.అయితే ఈ సందర్భంలో పవన్ కల్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.

ఎందుకంటే,ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ కర్నూలుకు వెళ్లి.. ఆ నగరమే తన దృష్టిలో రాజధాని అంటూ ప్రకటించాడు.

    అమరావతి ఉండే ఉండొచ్చు కానీ.. తన దృష్టిలో కర్నూలే రాజధాని అంటూ పవన్ కల్యాణ్ అప్పుడు ప్రకటించాడు. అలా కర్నూలు తన మనసుకు ఏపీ రాజధాని అంటూ ప్రకటించి, ఇప్పుడు కర్నూలుకు ఏపీ హై కోర్టు దక్కడాన్ని సహించలేకపోతూ ఉన్నాడ ని కొందరు విమర్శిస్తున్నారు.  ఈవిధంగా పవన్ తన  అవకాశవాదాన్ని బయటపెట్టుకుంటున్నాడని రాజకీయ  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇలా అయితే నెగ్గుకు రావడం కష్టమని అంటున్నారు.