వైసిపి కి అసలు ఆ అధికారం ఉందా అంటున్న పవన్

5
Pawan

మూడు రాజధానుల ప్రకటన వ్యవహారం పై దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. మూడు రాజధానులు, కమిటీల ఏర్పాటు, రాజధాని రైతుల ఆందోళనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ, రాజధాని రైతులకు ఆయన మరోసారి మద్దతు ప్రకటించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులపై కేసులు పెడతారా? అని పవన్ ప్రశ్నించారు. రైతులను రెచ్చగొట్టి కేసులు వరకు వెళ్లే పరిస్థితులను క్రియేట్ చేసింది వైసీపీ నేతల కాదా? అని పవన్ నిలదీశారు.

అసలు కర్నూలులో హైకోర్టు పెడతానికి వైసీపీకి అధికారం ఉందా? అని ప్రశ్నించారు. అలాంటి అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయా?, కేంద్రప్రభుత్వానికి ఉందా?. రాష్ట్రపతికి ఉందా? అనేదానిపై స్పష్టత ఇవ్వాలని పవన్ డిమాండ్ చేసారు. రాజధానిపై స్పష్టత ఇవ్వాలని వైసీపీని అడగాలని చెప్పారు. విశాఖను కేపిటల్‌గా ప్రకటిస్తున్నామని వైసీపీ చెప్పాలన్నారు. జీఎన్ రావు కమిటీ పర్పస్ ఏంటి?. భీమిలీలో కేపిటల్ పెట్టమని జీఎన్‌రావు కమిటీ చెప్పలేదు. వెనుకబడ్డ విజయనగరంలో లెజిస్లేటివ్ కేపిటల్ పెట్టమని జీఎన్‌రావు కమిటీ ప్రతిపాదించింది. వాళ్లు చెప్పిన సిఫార్సును వైసీపీ ఇంకా అమలు చేయలేదు. జగన్ ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రినా.?. కేవలం ఒక ప్రాంతానికే సీఎంనా’అని నిసలదీసారు.

ఎపి ప్రజలు ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలను ఇస్తే ఇలాంటి అసమానతలా క్రియేట్ చేసేది. ప్రజల మధ్య వైషమ్యాలను, విషాన్ని చిమ్మే అధికారం మీకు ఎవరిచ్చారు. గత ప్రభుత్వంలో తప్పులు జరిగి ఉంటే అనుమానం లేకుండా వాళ్లను శిక్షించండి. జుడీషియల్ కమిటీలు వేయండి. సీబీఐకి రిపోర్టులు ఇవ్వండి. ఇవన్నీ చేయకుండా ప్రజల్లో గందరగోళం సృష్టించడం ఎందుకు?. కర్నూలులో హైకోర్టు పెట్టడమంటే రాయలసీమ ప్రజల్నికూడా మోసం చేయడమే’అని పవన్ మండిపడ్డారు.