మెగా ఫ్యాన్స్ ను చీల్చడానికి పీకే స్కెచ్ వేశాడా

7
prasanth kishor

రాజకీయాలలో ఎవరు ఎవరికి మితృలుగా ఉంటారో,ఎవరు శతృవులో చెప్పలేం. ప్రస్తుతం ఏపీలోని పాలిటిక్స్ చూస్తే, టిడిపి తో కంటే, జనసేన తోనే వైఎస్సార్సీపీ కి రాజకీయంగా యుద్ధం నడుస్తోందన్న మాట బలంగా వినిపిస్తోంది. జనసేనని అసలు లెక్కలోకి తీసుకోవడం లేదని వైసీపీ నేతలు, అభిమానులు ఎంత చెప్పినా, నిరంతరం ఆ పార్టీ జపమే చేస్తున్నారు. పవన్ ఏ తప్పు మాట్లాడాడు, దాన్ని ఎలా వక్రీకరించి జనాల్లోకి తీసుకెళ్లే విధంగా వైసీపీ నుంచి ప్రచారం సాగుతోంది.

దీనివెనుక వైసిపి విజయానికి కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ పాత్ర ఉందని అంటున్నారు. రాజకీయ వర్గాల్లో ఇప్పుడు దీనిమీదే చర్చ నడుస్తోంది. జగన్ ముఖ్యమంత్రిగా అవ్వడానికి వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రశాంత్ కిషోర్ ను హైర్ చేసుకున్నారు.అయితే జగన్ ను ముఖ్యమంత్రి చేయడం ఒక్కటే కాదని, ఇంకా కొన్ని పనులు చక్కబెట్టేవిధంగా ఒప్పందం జరిగిందని అంటున్నారు. అందులో భాగంగానే ప్రశాంత్ కిషోర్ కు ఉన్న ఐప్యాక్ బృందమే ఈ మధ్య కాలంలో జనసేన పై జరుగుతున్న విష ప్రచారానికి తెరలేపిందని టాక్.

మొత్తం మీద మెగా ఫ్యాన్స్ నే ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ టీం టార్గెట్ చేసుకున్నారని వినిపిస్తోంది. మెగా అభిమానుల పేరిట కొన్ని ఫేక్ అకౌంట్స్ సృష్టించి కొంతమంది జగన్ కు సపోర్ట్ గా మాట్లాడ్డం మొదలుకొని అటు పవన్ పవన్, చిరు అభిమానుల్లో గొడవలు రేగేలా అంతర్గత కలహాలు తెస్తున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. మెగా ఫ్యామిలీలోనే కొందరు చిరు ఫోటో పెట్టుకొని చరణ్ ఫోటో పెట్టుకొని జగన్ కు మద్దతుగా ఉంటారు.దాన్ని చూసి మిగతా వారి మధ్యలో చిచ్చు మొదలవుతుంది. ఇది నిజమా కాదా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం ఇందుకు సంబంధించిన వార్తలు జోరుగా వైరల్ అవుతున్నాయి.