రష్మిక, పూజా లలో ఎవరు విన్నర్

4
rashmika vs pooja hegde

ఇప్పుడు తెలుగులో వరుస సిన్మాలు చేస్తున్న రష్మిక మందన, పూజా హెగ్డే వీరిద్దరిలో ఎవరిది పైచేయి,ఎవరు బెస్ట్ అంటూ మహేష్.. బన్ని అభిమానుల్లో చర్చ నడుస్తోంది. ఎందుకంటే, ఫ్యాన్ ఫాలోయింగ్ ఇద్దిరికీ బాగానే ఉంది. అయితే ఇందులో ఓ మెట్టు రష్మిక కన్నా పూజా ఉందని అంటున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఈ సంక్రాంతికి రానున్న సరిలేరు నీకెవ్వరు మూవీలో కన్నడ బ్యూటీ రష్మిక హీరోయిన్. అలాగే బన్నీ హీరోగా వస్తున్న అల వైకుంఠ పురంలో మూవీలో ముంబై బ్యూటీ పూజా హీరోయిన్. ఈ రెండు మూవీస్ సంక్రాంతి బరిలోకి రాబోతున్నాయి.

ఇక్కడ రష్మిక కంటే పూజా సీనియర్. ఎందుకంటే, బాలీవుడ్ సహా టాలీవుడ్ లో సీనియర్ హీరోలతో సినిమాలు చేసింది. అయితే సక్సెస్ పరంగా రష్మిక కంటే పూజా కొంచెం వెనుకవుందని చెబుతున్నారు. రష్మిక వరుస సక్సెస్ లతో ఛాన్సులు కొట్టేస్తుంటే, పూజ లక్కీ ఛామ్ గా గ్లామర్ ఎలివేషన్ తోనే ఛాన్స్ లు సంపాదిస్తోంది. ఇక్కడ పూజకి హైట్ కలిసొస్తుంది. టాలీవుడ్ హీరోలకు సమ జోడీగా మ్యాచ్ అవుతోంది. ఇక రష్మిక కొంచెం పొట్టిగా ఉన్నా సరే, ఛాన్సులు కొట్టేస్తోంది. ప్రేక్షకులు వీళ్లల్లో ఎవరికి ఎక్కువగా ఓటు వేసేది సంక్రాంతి సినిమాలు డిసైడ్ చేస్తాయి.

ఎందుకంటే, సరిలేరు నీకెవ్వరు భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఇందులో రష్మిక హీరోయిన్. పూజా అల వైంకుఠపురములో బన్నీ సరసన నటించింది. చిత్రంలో టైటిల్ పాత్ర తనదే. త్రివిక్రమ్ సినిమా కాబట్టి పూజా పాత్రకు అనవసర గ్లామర్ ఎలివేషన్ కు ఛాన్స్ ఉండదు. సన్నివేశాలతో మెప్పించాల్సి ఉంటుంది. అయితే పూజా సరిలేరు నీకెవ్వరు మూవీలో మహేష్ వెంట పడే చిలిపి పిల్ల గా కనిపించనుంది. ఆద్యంతం వినోదాత్మక చిత్రమిది. గ్లామర్ ఎలివేషన్ కు అంతగా ఆస్కారం లేని రోల్. ఇది కాస్త రష్మిక ఇమేజ్ కు ఇబ్బంది కల్గించేదే. వీటిలో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయితే వాళ్ళే విన్నర్ అవుతారు.