రవితేజ ఇలాంటి వాడని తెలిస్తే షాకవతాం

6
RaviTeja

  స్టార్ హీరో  తెలుగు సినిమా రంగంలో ఎవరి అండా లేకుండా,టాలెంట్ తో  10రూపాయల రెమ్యునరేషన్ నుంచి పదికోట్ల రేంజ్ కి ఎదిగాడు. కష్టపడే తత్త్వం, టాలెంట్,చేయూతనిచ్చినవారికి సాయమందించే వ్యక్తిత్వం పుష్కలంగా ఉన్నాయి.    సినిమాలో హీరో అవుదామని 1988లో చెన్నై వెళ్లిన రవితేజ ఏడాదిపాటు ఖాళీగానే గడిపాడు. తనకు పరిచయమైన డైరెక్టర్స్ వైవిఎస్ చౌదరి,గుణశేఖర్ లతో కల్సి వాళ్ళ రూమ్ లో ఉన్నాడు. ఇంటినుంచి తెచ్చుకున్న డబ్బులు అయిపోవడంతో చిన్న చిన్న వేషాలు వేసి, 10రూపాయల పారితోషికం తీసుకునేవాడు. గుణశేఖర్ సిఫార్స్ తో కర్తవ్యం  మూవీలో చిన్న పాత్ర వేసాడు.
  ఆ  సినిమాలో పేరు  రాకపోయినా , దానివలన  కారణంగా కృష్ణవంశీ వంటివాళ్ళు పరిచయం కావడంతో ఓ సర్కిల్ ఏర్పడింది.  చిన్న చిన్న ఛాన్స్ లు వచ్చాయి. డబ్బులు లేకపోవడంతో  కృష్ణవంశీ సూచన మేరకు గులాబీ,అనగనగా ఒకరోజు మూవీస్ కి అప్రెంటిస్ గా  చేసి, 1996లో కృష్ణ వంశీ తీసిన  నిన్నే పెళ్లాడతా మూవీకి, పూరి జగన్నాధ్ తో కల్సి  అసిస్టెంట్ డైరెక్టర్ గా కుదిరాడు. దీంతో పూరికి,రవికి మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. ఇక కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన సింధూరం మూవీలో ఒక హీరోగా రవి చేసాడు. మనసిచ్చి  చూడు మూవీలో రవి చేసిన నటన చూసిన అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీను వైట్ల తన మొదటి మూవీలో నీకే ఛాన్స్ అన్నాడు.

  చెప్పినట్టుగానే నీకోసం మూవీలో రవికి శ్రీను వైట్ల ఛాన్సిచ్చాడు. ఆతర్వాత పూరి జగన్నాధ్ వరుసగా ఇడియట్, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం,అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి ఇలా పూరి వరుస హిట్స్ ఇచ్చాడు. ఖడ్గం  విక్రమార్కుడు,కిక్,కృష్ణ వంటి మూవీస్ తో ఎలాంటి పాత్రకైనా రవి సూటవుతాడని తేలింది. ఎదిగిన తర్వాత తనను ఆదుకున్న వాళ్లకు సాయం చేసాడు. పూరి జగన్నాధ్ కి ఎప్పుడు కావాలంటే అప్పుడు  డేట్స్ ఇచ్చాడు.  గుణశేఖర్ తీసిన నిప్పు మూవీకి  రెమ్యునరేషన్ తీసుకోలేదు. కృష్ణ వంశీకి ప్రొడ్యూసర్స్ లేనప్పుడు డివివి దానయ్య తో తీయించాడు.  శ్రీను వైట్ల కష్టంలో ఉంటె అమర్ అక్బర్ ఆంటోని మూవీ  చేసిపెట్టాడు.  మొత్తానికి తనకు చేయూతనిచ్చిన వాళ్ళు కష్టంలో ఉంటె స్పందించడమే కాదు,ఇండస్ట్రీకి వచ్చే ఎందరికో స్ఫూర్తి అయ్యాడు.