పవన్ కళ్యాణ్ సినిమా లో హీరోయిన్ ఎవరంటే..!!

31
Pawan Kalyan Heroines

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ ఎంట్రీపై ఎప్పటినుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత రాజకీయ బాట పట్టిన పవన్ కళ్యాణ్.. తిరిగి వెండితెరపై కాలు మోపనున్నారనే వార్త మెగా అభిమానుల్లో సంబరాలు నింపింది. బోనీ కపూర్, దిల్ రాజు కలిసి సంయుక్తంగా నిర్మించనున్న ‘పింక్’ రీమేక్ ద్వారా పవన్ కళ్యాణ్.. రీ ఎంట్రీ ఖాయం అయింది.

తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ విషయమై ఓ కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుందని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో సూపర్ ఫార్మ్ లో ఉన్న పూజా హెగ్డేను పవన్ సరసన తీసుకోవాలని బోనీ కపూర్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. తెలుగులో వరుస సినిమాలు చేస్తూనే తమిళ, హిందీ భాషా చిత్రాల్లో నటిస్తున్న పూజా హెగ్డేనే ఫైనల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఈ నేపథ్యంలోనే పూజా హెగ్డేతో బోనీకపూర్ సంప్రదింపులు జరుపుతున్నట్టుగా సమాచారం.

ఇకపోతే పూజా హెగ్డే ఇప్పుడు మంచి జోష్‌లో ఉంది. అల్లు అర్జున్- త్రివిక్రం కాంబోలో రాబోతున్న ‘అల.. వైకుంఠపురములో’ సినిమాలో నటిస్తోంది. అలాగే ప్రభాస్ సరసన మరో సినిమాలో ఆడిపాడుతోంది. ఇప్పుడు పవన్ సినిమాలో కూడా ఈమెనే కన్ఫర్మ్ అయ్యిందంటే.. ఇక పూజా కెరీర్ వెనక్కి తిరిగి చూసుకునే పనే లేదని అంటున్నారు విశ్లేషకులు. ఏదేమైనా పవన్ రీ ఎంట్రీపై ఆతృతగా ఉంది ప్రేక్షక లోకం.