అక్కినేని ఫామిలీ  వేడుకలకు  సమంత రాకపోడానికి కారణం ఇదే …

6
samantha

ప్రతి సినిమాకు వేరియేషన్ చూపిస్తూ, అందాల ఆరబోతకు సైతం  సమంత  అడ్డుచెప్పకుండా కెరీర్‌లో టాప్ కి చేరింది.  అక్కినేని వారసుడు నాగచైతన్యను ప్రేమించడంతో  హిందూ, క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతిలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు.  చాలా  ఓపెన్ మైండెడ్ గా కనిపించే సమంత  పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో బిజీ బిజీ అయింది.

ఈ మధ్య ఓ బేబీ సినిమాలో కేక పుట్టించే హావభావాలను ప్రదర్శించిన సమంత  ఇప్పుడు శర్వానంద్ సరసన ‘96’ రీమేక్‌లో నటిస్తోంది.  ఇవన్నీ సరే,  అక్కినేని వారింట్లో జరిగే కార్యక్రమాలకు, ఫంక్షన్లకు సమంత రావడం లేదట. ఘనంగా జరిగిన ఏఎన్‌ఆర్ అవార్డుల ప్రధానోత్సవానికి ఒక్క సమంత తప్ప అక్కినేని ఇంటి వారంతా హాజరయ్యారు.  బాలీవుడ్ నటి రేఖ, దివంగత నటి శ్రీదేవికి అవార్డు ఇచ్చారు.  అయితే, షూటింగ్ వల్ల వీలుకాలేదని తర్వాత వివరణ ఇచ్చుకొచ్చింది.

ఇక ,నాగార్జున సోదరుడు వెంకట్ కుమారుడి నిశ్చితార్ధ వేడుక చెన్నైలో జరిగింది.  నాగార్జున కుటుంబమంతా హాజరైంది. కానీ  ఈ  వేడుకకు కూడా సమంత రాలేదట.  వాస్తవానికి ప్రతి చిన్న సందర్భంలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టే సమంత, కనీసం ఇలాంటి వేడుకలకు ఎందుకు రావడం లేదో   పోస్ట్ పెట్టలేదని,  నాగచైతన్య, సమంత మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయా?   అసలు ఏం జరిగింది? అని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. అక్కినేని ఫామిలీ వివరణ ఇచ్చేదాకా  ఊహాగానాలు జోరుగానే సాగిపోతాయి.