రేష్మి,అనసూయలకు పోటీగా సమీరా

5
sameera sherief

విపరీతమైన పాపులార్టీ తో దూసుకెళుతోన్న జబర్దస్త్ కామెడీ షో లో జడ్జీలుగా నాగబాబు, రోజా ఉండేవారు. అయితే నాగబాబు బయటకు వచ్చి, జీతెలుగులో అదిరింది ప్రోగ్రాం కి జడ్జిగా చేస్తున్నాడు. జబర్దస్త్ కి పోటీగా కామెడీ షో గా వస్తున్న అదిరింది షో ప్రతి ఆదివారం ప్రసారం అవుతోంది. అయితే పలు సీరియల్స్ తో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సమీరా అదిరింది షో కి యాంకర్ గా వ్యవహరిస్తోంది. 1991లో హైదరాబాద్ లో జన్మించిన సమీరా అక్కడే తన బాల్యం,విద్యాభ్యాసం గడిపింది. డిగ్రీ పూర్తిచేసి,డాన్సింగ్,నటనలో శిక్షణ పొందింది.

స్కూల్ డేస్ నుంచి నటనపై మక్కువ ఉండడంతో సమీరను ఫామిలీ మెంబర్స్ కూడా ప్రోత్సహించారు. తండ్రి పూర్తిగా సహకరించి కుమార్తె ఎదుగుదలకు సాయం అందించాడు. పలు సీరియల్స్ లో కల్సి నటించిన అన్వర్ ని ప్రేమించి పెళ్లాడింది. ప్రముఖ నటి సన కుమారుడే అన్వర్. ఆడపిల్ల,అభిషేకం,భార్యామణి,ప్రతిబింబం,మంగమ్మగారి మనవరాలు ,తదితర సీరియల్స్ లో నటించి మెప్పించిన సమీరా తమిళంలో కూడా పేరుతెచ్చుకుంది.

పెళ్లయ్యాక కొన్ని సీరియల్స్ లో నటించిన సమీరా,తాజాగా జి తెలుగు అదిరింది కామెడీ షో కారణంగా సీరియల్స్ కి గ్యాప్ ఇచ్చింది. అదిరింది షో స్టార్టింగ్ లో మొదలయ్యే సాంగ్ కి తన డాన్స్,గ్లామర్ తో మరింత వన్నె తెస్తోంది. గ్లామర్ విషయంలో పెద్దగా పట్టింపులు లేవని తొలి షో ద్వారా చెప్పిందని టాక్. దీంతో సోషల్ మీడియాలో ఆమెకు ఫాలోయింగ్ కూడా పెరుగుతోంది. రెండో షో లో అయితే కిక్కిచ్చేలా యాంకరింగ్ చేసిందన్న మాట వినిపిస్తోంది. మరి రష్మీ,అనసూయ లకు పోటీగా సమీరా యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంటుందా లేదా అనేది తేలాలి.