సరిలేరు నీకెవ్వరూ క్లైమాక్స్  పై అనుమానాలు…..

6
sarileru neekevvaru_Mahesh

ఏ సినిమా క్లిక్ అవ్వాలన్న పాటలు,కామెడీ,ఫైట్స్ ఇలా అన్నీ ఎంతముఖ్యమో  క్లైమాక్స్ కూడా అంతేముఖ్యం.  అందుకే మన తెలుగు సినిమాల్లో క్లైమాక్స్ కి ప్రత్యేకత ఉంది.  ఇక భారీ బడ్జెట్ తో తీసి కమర్షియల్ మూవీస్ అయితే క్లైమాక్స్ దుమ్మురేపేస్తుంది. సమస్య పరిష్కరించడానికి విలన్ ని అంతమొందించడం ప్రధానంగా చూస్తుంటాం. హీరోయిజం విన్ అవుతుంది. ఇక కామెడీ మూవీ అయితే ఫన్నీగా ముగిస్తారు. ఇక  హీరో గానీ హీరోయిన్ గానీ ,ఒక్కోసారి ఇద్దరూ గానీ చనిపోవడం కూడా ఉండడంతో  క్లైమాక్స్ విషాదంతో ముగుస్తుంది.

డైరెక్టర్ అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరూ భారీ బడ్జెట్ మూవీని సూపర్ స్టార్ మహేష్ తో తెరకెక్కిస్తున్నాడు. ఎఫ్ 2తో డిఫరెంట్ చూపించిన అనిల్ ఇప్పుడు ఈ మూవీలో  సరికొత్త క్లైమాక్స్ ని చూపించబోతున్నాడని టాక్. ఎందుకంటే, ఎఫ్ 2ద్వారా కూల్ ఎమోషన్స్ తో  కామెడీ కిక్కు ఇచ్చి విజయాన్ని నమోదుచేసుకున్న అనిల్ అంతకుముందు పటాస్ మూవీతో కళ్యాణ్ రామ్ కి హిట్ ఇచ్చాడు. ఈమూవీలో  కామెడీ పండిస్తూ ఎమోషనల్ టచ్ ఇవ్వడంతో హిట్ టాక్ అందుకుంది. అదేవిధంగా  సుప్రీం మూవీ సాయి ధర్మ తేజ్ తో తీసి,కామెడీతో పాటు ఎమోషన్ పండించాడు. రాజా ది గ్రేట్ మూవీలో రవితేజను బ్లైండ్ గా చూపిస్తూ మంచి కామెడీ పండించాడు.

ఇప్పుడు తీస్తున్న సరిలేరు నీకెవ్వరూ మూవీలో  ఒకప్పటి స్టార్ హీరోయిన్ విజయశాంతి ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తోంది. దాంతో మిగిలిన సినిమాలకు భిన్నంగా   అనిల్ మార్క్ ఇందులో అలరించబోతోంది.  టీజర్ చూస్తుంటే,అందులో ప్రకాష్ రాజ్ సంక్రాంతికి అల్లుడొస్తాడు,కానీ ఇప్పుడు మొగుడొచ్చాడు అని ఎమోషనల్ గా చెప్పే డైలాగ్ కామెడీ ట్రాక్ లో ఉంది. ఇది చూసాక అనిల్ కామెడీని ఏవిధంగా ఇందులో పండించబోతున్నాడో అర్ధం అయిపోతుంది.  ఫాన్స్ కి,ఆడియన్స్ కి ఎప్పటికీ  గుర్తుండిపోయేలా క్లైమాక్స్ ఇవ్వాలని అనిల్ చాలా ఎక్సర్ సైజ్ చేసి ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడని అంటున్నారు.