జగన్ కి స్వామి,కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

10
Shocking comments by Jagan Ki Swamy, KTR

బీజేపీ ఎంపీ డాక్టర్ సుబ్రమణ్య స్వామి ఓ పట్టాన ఎవరినీ పొగడరు సరికదా తప్పులేమైనా ఉంటే బూతద్దంలో వెతికి మరీ ఓ ఆట ఆడుకుంటారు. అయితే దివారం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్నను ఆయన దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై కామెంట్స్ చేశారు. . జగన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. తిరుమలను క్రిస్టియానిటీ కేంద్రంగా మారుస్తున్నారన్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. అవన్నీ అవాస్తవాలే ,అలాగే టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి అన్యమతస్థుడన్న ప్రచారం కూడా అవాస్తవమేనని ఆయన వ్యాఖ్యానించారు. టీటీడీపై మతపరమైన ఆరోపణలు చేస్తున్నవారిపై కేసులు నమోదు చేయాలని ఈ సందర్భంగా టీటీడీ సిబ్బంది, చైర్మన్‌కు ఎంపీ సూచించారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరిగితే మొదట తానే స్పందిస్తానని డాక్టర్ స్వామి చెప్పుకొచ్చారు.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశంపై టి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘ఆస్క్‌ కేటీఆర్‌’ పేరుతో ట్విట్టర్‌లో ఆయన సమాధానాలు చెబుతూ, ఏపీలో 6 నెలల్లో జగన్‌ పరిపాలన బాగుందని కొనియాడారు. ఏపీలో 3 రాజధానుల అంశంపై స్పందించాల్సింది ఏపీ ప్రజలు మాత్రమేనని చెప్పారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తల కృషి వల్లే తనకు మంత్రి పదవి వచ్చిందని పేర్కొన్నారు. మంత్రి పదవి కన్నా పార్టీ పదవి తనకు విలువైందని కేటీఆర్ అన్నారు.

కొత్త మున్సిపల్‌ చట్టంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని, వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కేటీఆర్ తెలిపారు. జనవరి మొదటివారంలో వరంగల్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ మాస్టర్‌ ప్లాన్‌ ప్రకటిస్తామన్నారు. 111 జీవోపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కేటీఆర్ చెప్పారు. రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థను బ్యాలెన్స్ చేయడం పెద్ద సవాల్ అన్నారు. తనను అధికంగా ప్రభావితం చేసే రాజకీయ నాయకుడు కేసీఆరే అని చెప్పుకొచ్చారు.