పెరియర్‌ పై చేసిన వ్యాఖ్యల్లో ఇరుక్కున్న సింగర్ చిన్మయి

4
Singer Chinmayi is stuck in comments on Perrier

గాయని చిన్మయి శ్రీపాద ఈమధ్య ఆయా అంశాలపై మాట్లాడుతూ వివాదాల్లో ఉంటోంది. తాజాగా మరో వివాదం చుట్టుముట్టింది. అయితే ఈ సారి తన వ్యాఖ్యలకు బదులుగా తన తల్లి మాట్లాడిన తీరుకు ఆమె వార్తల్లో చేరింది. ఇంతకు ముందు మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై ఆమె పోరాటం చేశారు. ఇక కోలీవుడ్‌ ప్రముఖ రచయిత వైరముత్తుపై చిన్మయి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో కోలీవుడ్‌ డబ్బింగ్‌ అసోషియేషన్ ఆమెపై వేటు కూడా వేసింది.

ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న చిన్మయి తల్లి చేసిన షాకింగ్ కామెంట్స్ కి ఆమె బాధ్యత వహించాల్సి వస్తోంది. దేవదాసీ వ్యవస్థను కూల్చివేసిన హేతువాది పెరియర్‌ను తాను ఎప్పటికీ క్షమించనని ఆమె తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో చిన్మయి తల్లి తీరుపై ప్రస్తుతం నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ విషయాన్ని చిన్మయి ట్విటర్‌ అకౌంట్‌కు జోడించి దీనికి సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.
ఈ అంశంపై చిన్మయి స్పందిస్తూ, తన తల్లి మాటలకు బాధ్యత వహించేదిలేదని స్పష్టం చేసేసింది. ‘ఆమె మాటలను మీరు వ్యతిరేకించాలనుకుంటే వ్యతిరేకించండి. ఆమెకు మాట్లాడే హక్కు ఉంది. తన ఉద్దేశాలను నేను తప్పుపట్టాను. సమాధానం చెప్పే సామర్థ్యం తనకు ఉంది’ అంటూ ఘూటుగా స్పందించారు. మొత్తానికి తల్లీ కూతుళ్లు ఇలా సెన్షేషన్స్ సృష్టిస్తున్నారు.