ట్విట్టర్ పక్షులకు ఆహరం అయిన సోమగుట్ట విష్ణువర్ధన్ రెడ్డి……

4
Somagutta Vishnuvardhan Reddy, Twitter feeder ……

సోమగుట్ట విష్ణువర్ధన్ రెడ్డి , ఈ పేరు నిన్నటి దాకా చాలా కొద్ది మందికే తెలుసు.. అలాంటిది ట్విట్టర్ పుణ్యమా ఈయన ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. బీజేపీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ పదవిలో ఉన్నారు..ఈయనది అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం. ఒక కులాన్ని అదే కులానికి చెందిన ప్రముఖ హీరోని టార్గెట్ చేసి దూషిస్తున్న ట్వీట్లు ఆయన ట్విట్టర్ ఖాతాలో దర్శనమిచ్చాయి. అవి టిడిపి అభిమానుల కళ్ళలో పడ్డాయి. చిన్న చిన్న వాటినే వదలని మన నెటిజన్లు అంతటి మాటలని అంత సులువుగా వదులుతారా.. చివరకి ఆయన ఖాతా మూసేసుకునే దాకా వదలలేదు.

అప్పట్లో తళుకుమన్న ఒక తార అంటే తనకి ఎంతో ఇష్టమని తనతో నటించమని ఏకంగా మహేష్ బాబు లాంటి స్టార్ హీరో పేరు ప్రస్తావించి ఒక ట్వీట్ చేశారు. ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఎన్నో..కానీ ఒక నాయకుడిగా తన ఖాతా నుండి ఇలాంటి ట్వీట్లు ఎవ్వరు చేసి ఉండరు. మామూలుగానే ట్విట్టర్ , ఫేస్బుక్ లాంటి మాధ్యమాల్లో చురుక్కుగా ఉంటాడు విష్ణువర్ధన్. అలాంటిది ఇంత రచ్చ సోషల్ మీడియాలో జరుగుతున్నా మౌనంగా ఎందుకు ఉన్నారా అని చాలా సేపు అందరూ ఖంగు తిన్నారు. చివరకు ట్విట్టర్ లో జరుగుతున్న యుద్దానికి ఫేస్బుక్ ద్వారా సమాధానం ఇచ్చారు విష్ణువర్ధన్ రెడ్డి.

నా పేరు మీద గత కొంత కాలంగా వాడుతున్నది ఒక థర్డ్ పార్టీ.. అది వారు ఎవరో వేరే వ్యక్తి నుంచి తీసుకొని నా పేరు మీద వాడుతున్నారు. కావున అప్పుడు ఎప్పుడో 7-8 సంవత్సరాల క్రితం చేసిన పోస్టులకు.. కామెంట్లకు.. నాకు ఎలాంటి సంబంధం లేదు. 23 సంవత్సరాలుగా ప్రజాజీవితంలో ఉండి ప్రతి కులం..మతం పైన అపార గౌరవంతో ఉన్నాను. నేను బాధ్యతగల భారతీయ పౌరుడిని. ఒక కులాన్ని.. మతాన్ని..వ్యక్తిని.. దుర్భాషలాడిన సంఘటనలు నా జీవితంలో జరగలేదు.. జరగబోవు.. ” అంటూ ఫేస్బుక్ లో ఒక పోస్టు పెట్టారు. ఎవరో రాతలకు ఒక రోజంతా ట్విట్టర్ పక్షులకు విష్ణువర్ధన్ గారు ఆహారమయ్యారని నెటిజన్లు అనుకుంటున్నారు. ఆయన పోస్టు చదివాక..ఆహా! ఓహో! అలాగా! అందుకే ఏదైనా చేసే ముందు చూసి చెయ్యాలి అంటారు.. ఖాతా చూసి కొనుక్కుంటే ఇంత పని జరిగేదే కాదు అని కూడా కొందరు అంటున్నారు. ఎవ్వరు ఏమనుకున్నా చివరికి మంచో..చెడో.. ఒకరోజంతా సోషల్ మీడియా మొత్తం విష్ణువర్ధన్ రెడ్డి గారి ట్వీట్లే కనిపించాయి.