2019 లో మిస్ అయిన స్టార్ హీరోలు….

4
Star heros miss in 2019

మన టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఇప్పుడు ఏడాదికి ఒక సినిమా కూడా చేయడంలేదు. విపార్టీతంగా గ్యాప్ వచ్చేస్తోంది. దాంతో 2019లో కొందరు హీరోలు స్క్రీన్స్ పై కనిపించలేదు ముందుగా ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా చేసే జూనియర్ ఎన్టీఆర్ , అరవింద సమేత తర్వాత పూర్తిగా కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని ఈ ఏడాది రాజమౌళి సినిమా ఆర్ ఆర్ ఆర్ లో జాయిన్ అయ్యాడు. 2020లో రాజమౌళి సినిమాతో ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు వస్తాడు. ఇక 2003లో గంగోత్రి సినిమాతో కెరీర్ మొదలుపెట్టినప్పట్నుంచి ప్రతియేటా మూవీ రిలీజ్ చేస్తున్న బన్నీ 2019లో మాత్రం మిస్ అయ్యాడు. నా పేరు సూర్య తర్వాత భారీ గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ అల వైకుంఠపురములో మొదలుపెట్టాడు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.

అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ కల్యాణ్ మళ్లీ కనిపించలేదు. జనసేన పార్టీ పెట్టడం,ఆతర్వాత ఎన్నికలు, రాజకీయాలతో బిజీ అయిపోయాడు. అయితే మళ్లీ పింక్ సినిమా రీమేక్ తో పవన్ రాబోతున్నాడని టాక్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకుడు. డిసెంబర్ లోనే ఈ చిత్రం మొదలు పెడతారట. అయితే పవన్ ఫిబ్రవరిలో సెట్ లో అడుగు పెడతాడట. కాగా 2018లో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా తర్వాత మాస్ రాజా రవితేజ మరోసారి భారీ గ్యాప్ తీసుకున్నాడు. డిసెంబర్ లోనే రావాల్సి న డిస్కో రాజా జనవరి 24కి వాయిదా పడింది. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల్లో నాగేశ్వరరావు పాత్రలో నటించిన సుమంత్ కి 2019లో సినిమాలేవీ లేవు. శ్రీనివాస కళ్యాణం తర్వాత నితిన్ నుంచి మరో సినిమా రాలేదు. ప్రస్తుతం ఒకట్రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది భీష్మ సినిమాతో రావాలనుకుంటే కుదర్లేదు. ప్రస్తుతం భీష్మ. రంగ్ దే, చదరంగం సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది గద్దలకొండ గణేష్ సినిమాలో గెస్ట్ రోల్ చేసాడు. ఒకప్పుడు ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసిన అల్లరి నరేష్, గత రెండేళ్లుగా అస్సలు ఆ జోరు లేదు. అయితే 2019లో మహర్షి సినిమాలో మహేష్ స్నేహితుడిగా నటించాడు.

ఒక్కడు మిగిలాడు సినిమా తర్వాత మంచు మనోజ్ రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. గతేడాది సమ్మోహనం లాంటి సినిమాతో విజయం అందుకున్న సుధీర్ బాబు ఆ తర్వాత వీరభోగ వసంతరాయలు తర్వాత మళ్లీ సినిమాలేవీ చేయలేదు. ఒకప్పుడు ఏడాదికి అరడజన్ సినిమాలు చేసిన నారా రోహిత్ పూర్తిగా ఫేడవుట్ అయిపోయాడు. గతేడాది ఈయన చిలసౌ సినిమాతో వచ్చిన అక్కినేని మేనల్లుడు సుశాంత్ 2019లో కనిపించలేదు.